ETV Bharat / sports

హోటల్ సిబ్బందితో భారత ఆటగాళ్ల స్టెప్పులు.. వీడియో వైరల్

author img

By

Published : Dec 31, 2021, 11:22 AM IST

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అద్భుత విజయం సాధించింది టీమ్ఇండియా. ఈ గెలుపు అనంతరం హోటల్ సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు భారత ఆటగాళ్లు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Team India dance, టీమ్ఇండియా డ్యాన్స్
Team India dance

IND vs SA Test: దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి మ్యాచ్‌తోనే చరిత్ర సృష్టించి ఆకట్టుకుంది టీమ్ఇండియా. సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లీసేన 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ మైదానంలో గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా ఆనందంలో మునిగితేలారు. మ్యాచ్‌ అనంతరం హోటల్‌కు చేరుకున్న వీరికి అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

డాన్స్‌ చేస్తోన్న హోటల్‌ సిబ్బందిని చూసి భారత క్రికెటర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఛెతేశ్వర్‌ పుజారా కూడా స్టెప్పులేశారు. ఈ వీడియోను అశ్విన్‌ తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. "మ్యాచ్‌ అనంతరం ఎప్పుడూ ఉండే ఫొటోలు బోర్‌ కొడతాయి. దీంతో ఈ సందర్భాన్ని మరింత మధుర జ్ఞాపకంగా మిగిల్చేందుకు పుజారా.. తొలిసారి సిరాజ్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇదో గొప్ప విజయం" అంటూ అశ్విన్‌ ఆ వీడియోను పంచుకున్నాడు.

ఇవీ చూడండి

India Rewind 2021: టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్ వీరే!

Rewind 2021: చారిత్రక విజయాలు.. అద్వితీయ రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.