Team India practice:ఇప్పటిదాకా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. 2011లో సిరీస్‌ను డ్రా చేసుకోవడాన్ని మినహాయిస్తే.. ప్రతి పర్యటనలోనూ ఓటములే ఎదుర్కొంది భారత్. అయితే ఈ నెల 26న ఆ దేశంలో మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్ సిరీస్ గెలవడానికి మంచి అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న భారత క్రికెటర్లు వెంటనే సాధన ఆరంభించేశారు. ఆ దేశ పరిస్థితులకు అలవాటు పడేందుకు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రాంతంలో కోహ్లీసేన సాధన చేస్తుండటం విశేషం. అక్కడి ఫుట్‌వ్యాలీలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ల ఆధ్వర్యంలో ఆటగాళ్ల సాధన సాగింది. కసరత్తులతో పాటు ఫుట్‌బాల్ ఆడుతూ, రన్నింగ్ చేస్తూ ఆటగాళ్లు కనిపించారు. ఉల్లాసభరిత వాతావరణంలో ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న దృశ్యాలూ ఇందులో దర్శనమిచ్చాయి.
-
#TeamIndia begin preparations for the first Test in Centurion 🏟️👌🏻
— BCCI (@BCCI) December 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
First practice session done ✅#SAvIND pic.twitter.com/kNjutdpF64
">#TeamIndia begin preparations for the first Test in Centurion 🏟️👌🏻
— BCCI (@BCCI) December 18, 2021
First practice session done ✅#SAvIND pic.twitter.com/kNjutdpF64#TeamIndia begin preparations for the first Test in Centurion 🏟️👌🏻
— BCCI (@BCCI) December 18, 2021
First practice session done ✅#SAvIND pic.twitter.com/kNjutdpF64