ETV Bharat / sports

IND VS SA: 'దక్షిణాఫ్రికా టూర్​లో టీమ్​ఇండియా బలం వాళ్లే..' - IND VS SA

IND VS SA: టీమ్​ఇండియా బౌలింగ్ విభాగంపై ధీమా వ్యక్తం చేశాడు సీనియర్​ ఆటగాడు చెతేశ్వర్​ పుజారా. సౌతాఫ్రికాతో జరగబోయే ప్రతి టెస్టు మ్యాచ్​లోనూ ఫాస్ట్ బౌలింగ్​ యూనిట్ 20 వికెట్లు తీయగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ind vs sa test
ఇండియా వర్సెస్​ సౌత్​ఆఫ్రికా
author img

By

Published : Dec 19, 2021, 3:40 PM IST

Updated : Dec 19, 2021, 3:47 PM IST

IND VS SA: దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్​కు భారత్​ ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీమ్​ బౌలింగ్​ విభాగంపై ధీమా వ్యక్తం చేశాడు సీనియర్​ ఆటగాడు చెతేశ్వర్​ పుజారా. సౌతాఫ్రికాతో జరగబోయే ప్రతి టెస్టు మ్యాచ్​లోనూ ఫాస్ట్ బౌలింగ్​ యూనిట్ 20 వికెట్లు తీయగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు.

"ఫాస్ట్​ బౌలర్లు మా జట్టు బలం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు చక్కగా రాణించగలరు. ప్రతి టెస్టు మ్యాచ్​లోనూ 20 వికెట్లు రాబట్టగలరు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లోనూ బౌలింగ్​ జట్టు అద్భతంగా రాణించింది. ఈ మ్యాచ్​లోను అదే విధంగా ఉంటుంది."

-చెతేశ్వర్​ పుజారా

IND vs SA Test News: ఇప్పటిదాకా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. 2011లో సిరీస్‌ను డ్రా చేసుకోవడాన్ని మినహాయిస్తే.. ప్రతి పర్యటనలోనూ ఓటములే ఎదుర్కొంది భారత్‌. అయితే ఈ నెల 26న ఆ దేశంలో మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్‌ సిరీస్‌ గెలవడానికి మంచి అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

IND vs SA: సిరీస్​ గెలుపే లక్ష్యంగా టీమ్ఇండియా.. కొండల్లో సాధన

IND vs SA Test: కేఎల్ రాహుల్​కు బంపర్ ఆఫర్​.. రోహిత్ స్థానంలో

Last Updated : Dec 19, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.