IND Vs SA ODI series team: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ.. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిసింది. వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి రానున్నాడని క్రికెట్ వర్గాలు నుంచి సమాచారం. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడట. మరి హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు కాబట్టి వైస్‌కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 19, 21, 23 తేదీల్లో జరగనుంది. ఇందుకోసం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును బోర్డు సిద్ధం చేసిందని తెలుస్తోంది. వచ్చే వారంలో టీమ్‌ను ప్రకటించనున్నారట.
మూడో స్థానంలో కోహ్లీ.. నాలుగో స్థానంలో సూర్యకుమార్ లేదా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్, ధావన్ రాకతో కేఎల్ రాహుల్ కూడా మిడిలార్డర్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీలో బాగా రాణించి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకోనున్నారట. ఐపీఎల్లో రుతురాజ్ 635 పరుగులు చేయగా.. విజయ్ హజారే టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు.
రుతురాజ్‌తో పాటు ఫామ్‌లో ఉన్న మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశముంది. ఇటీవలే విజయ్ హజరే ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు ఆరు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు సహా 379 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ కూడా టీమ్‌లో ఉండనున్నారట.
బౌలర్లలో బుమ్రా, భవనేశ్వర్కుమార్, మహ్మద్ షమి, అశ్విన్, చాహల్‌ను తీసుకోనున్నారు. హర్షల్ పటేల్, దీపక్ చాహర్ బ్యాకప్ ప్లేయర్లుగా ఉంటారు.
జట్టు(అంచనా)
రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అశ్విన్, చాహల్.
ఇదీ చూడండి: 2021 Cricket Highlights: భారీ సిక్సర్లు.. స్టన్నింగ్ క్యాచ్‌లు!