ETV Bharat / sports

IND vs SA: దక్షిణాఫ్రికాకు తలనొప్పిగా కోహ్లీ, పుజారా!

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్​ఇండియా సారథి కోహ్లీ, పుజారా.. తమకు తలనొప్పిగా మారారని అన్నాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడు కీగన్ పీటర్సన్. నేడు(గురువారం) జరిగే ఆటలో వాళ్లను త్వరగా పెవిలియన్​కు చేర్చడంపై దృష్టిసారిస్తామన్నాడు.

Kohli Pujara
కోహ్లీ పుజారా
author img

By

Published : Jan 13, 2022, 12:37 PM IST

IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, పుజారాపై కీలక వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్​. వారిద్దరూ.. సౌతాఫ్రికాకు తలనొప్పిగా మారారని అన్నాడు. మూడో టెస్టులో భాగంగా గురువారం జరిగే ఆటలో వారిని త్వరగా పెవిలియన్​కు చేర్చడంపై దృష్టిసారిస్తామన్నాడు.

"గురువారం మ్యాచ్​లో మా ప్రధాన లక్ష్యం త్వరగా వికెట్లు పడగొట్టడం. ప్రస్తుతం బ్యాటింగ్​ చేస్తున్న ఇద్దరు మాకు కొంత తలనొప్పిగా మారారు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్​​. ఆ విషయాన్ని అతడు ప్రతిసారీ నిరూపించుకుంటూ వస్తున్నాడు. విరాట్​ను త్వరగా ఔట్​ చేస్తే.. మ్యాచ్​లో భారీగా మార్పులు జరగొచ్చు" అని కీగన్ పీటర్సన్ పేర్కొన్నాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో.. విరాట్ కోహ్లీ(79) జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. ఇక బుధవారం జరిగిన ఆటలో స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన భారత్​ను దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. మయాంక్(7), కేఎల్​ రాహుల్​(10)లను వరుస ఓవర్లలోనే పెవిలియన్​కు చేర్చారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ(14*), పుజారా(9*).. మరో వికెట్​ పడకుండా జాగ్రత్త వహించారు. ప్రత్యర్థి పేసర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి: IND vs SA: 'టెస్టు క్రికెట్​లోనూ ఫ్రీ హిట్​ రూల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.