Ind Vs Sa 2nd Test 2024: కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా అదరగొడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు ఓ ఆట ఆడేసుకున్నారు.పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై నిప్పులు చెరుగుతూ సఫారీ జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేశారు. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు.
India Batting First Innings:రెండో సెషన్లోనే బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా కూడా ఫ్లాట్ పిచ్‌పై పరుగులు చేయడానికి కష్టపడింది. 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మాత్రమే రాణించారు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. సఫారీ పేసర్ల దెబ్బకు టీమ్ఇండియాలో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో 153 పరుగుల వద్దే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా, బర్గర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు.
-
From 153/4 to 153 all out 😲
— ICC (@ICC) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
After South Africa, India too have been bowled out on Day 1 ☝#WTC25 | 📝 #SAvIND: https://t.co/ie8HUxBDc8 pic.twitter.com/hIcqFTdrke
">From 153/4 to 153 all out 😲
— ICC (@ICC) January 3, 2024
After South Africa, India too have been bowled out on Day 1 ☝#WTC25 | 📝 #SAvIND: https://t.co/ie8HUxBDc8 pic.twitter.com/hIcqFTdrkeFrom 153/4 to 153 all out 😲
— ICC (@ICC) January 3, 2024
After South Africa, India too have been bowled out on Day 1 ☝#WTC25 | 📝 #SAvIND: https://t.co/ie8HUxBDc8 pic.twitter.com/hIcqFTdrke
ఈ మ్యాచ్‌లో పలు విశేషాలు
టెస్టుల్లో భారత్‌పై అత్యల్ప స్కోర్లు
- 55 - సౌతాఫ్రికా (కేప్ టౌన్) 2024
- 62 - న్యూజిలాండ్ (ముంబయి) 2021
- 79 - సౌతాఫ్రికా(నాగ్‌పూర్) 2015
- 81 - ఇంగ్లాండ్ (అహ్మదాబాద్) 2021
- 82 - శ్రీలంక (చండీగఢ్) 1990
1991 తర్వాత టెస్టుల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్లు
- 55- భారత్‌పై (కేప్ టౌన్) 2024
- 73 - శ్రీలంకపై (గాలె) 2018
- 79 - భారత్‌పై (నాగ్‌పూర్) 2015
- 83 - ఇంగ్లాండ్‌పై (జోహనెస్‌బర్గ్) 2016
- 84 - భారత్‌పై (జోహనెస్‌బర్గ్) 2006
టెస్టుల్లో అతి తక్కువ పరుగులు ఇచ్చి 5+ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
- 5/7 - జస్ప్రీత్ బుమ్రా vs వెస్టిండీస్ (2019)
- 6/12 - వెంకటపతి రాజు vs శ్రీలంక (1990)
- 5/13 - హర్భజన్ సింగ్ vs వెస్టిండీస్ (2006)
- 6/15 - మహ్మద్ సిరాజ్ vs సౌతాఫ్రికా (2024)
- 5/18 - సుభాష్ గుప్త vs పాకిస్థాన్ (1955)
టాప్10లోకి విరాట్- ఎమర్జింగ్ నామినేషన్స్‌లో యశస్వీ- ఐసీసీ లేటెస్ట్ అప్డేట్స్
సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్‌కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే!