Ind Vs Sa 1st ODI 2023 : సౌతాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. సఫారీ జట్టు నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ (55), శ్రేయస్ అయ్యర్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ మల్డర్, ఫెలుక్వాయో తలో వికెట్ దక్కించుకున్నారు. 5 వికెట్లతో సఫారీలను శాసించిన పేసర్ అర్షదీప్ సింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది. ఈ విజయంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఇరుజట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న జరగనుంది.
-
Scalping a 5⃣-wicket haul, Arshdeep Singh was on a roll with the ball & bagged the Player of the Match award as #TeamIndia won the first #SAvIND ODI. 👏 👏
— BCCI (@BCCI) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/tHxu0nUwwH pic.twitter.com/tkmDbXOVtg
">Scalping a 5⃣-wicket haul, Arshdeep Singh was on a roll with the ball & bagged the Player of the Match award as #TeamIndia won the first #SAvIND ODI. 👏 👏
— BCCI (@BCCI) December 17, 2023
Scorecard ▶️ https://t.co/tHxu0nUwwH pic.twitter.com/tkmDbXOVtgScalping a 5⃣-wicket haul, Arshdeep Singh was on a roll with the ball & bagged the Player of the Match award as #TeamIndia won the first #SAvIND ODI. 👏 👏
— BCCI (@BCCI) December 17, 2023
Scorecard ▶️ https://t.co/tHxu0nUwwH pic.twitter.com/tkmDbXOVtg
చిన్న టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) స్వస్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. అతడ్ని 3.4 ఓవర్ వద్ద వియాన్ మల్డర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అయ్యర్ సౌతాఫ్రికా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. అతడు సుదర్శన్‌లో కలిసి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమ్ఇండియాను విజయం అంచుల దాకా తీసుకొచ్చి అయ్యర్, ఫెలుక్వాయో బౌలింగ్‌లో క్యాచౌట్‌గా క్రీజును వీడాడు. అయ్యర్ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (1*) సింగిల్ తీసి విజయం ఖరారు చేశాడు.
-
Congratulations Team India on their win in the first ODI against South Africa! @arshdeepsinghh secured 5 wickets in a stellar performance and debutant @sais_1509’s fabulous 50, played a pivotal role in the team’s victory! @BCCI pic.twitter.com/cUl5JtzvLE
— Jay Shah (@JayShah) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations Team India on their win in the first ODI against South Africa! @arshdeepsinghh secured 5 wickets in a stellar performance and debutant @sais_1509’s fabulous 50, played a pivotal role in the team’s victory! @BCCI pic.twitter.com/cUl5JtzvLE
— Jay Shah (@JayShah) December 17, 2023Congratulations Team India on their win in the first ODI against South Africa! @arshdeepsinghh secured 5 wickets in a stellar performance and debutant @sais_1509’s fabulous 50, played a pivotal role in the team’s victory! @BCCI pic.twitter.com/cUl5JtzvLE
— Jay Shah (@JayShah) December 17, 2023
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా పేసర్ల దెబ్బకు సఫారీలు విలవిల్లాడిపోయారు. యంగ్ పేసర్లు అర్షదీప్ సింగ్ 5, ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో సఫారీ గడ్డపై నిప్పులు చెరిగారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (0), రస్సీ వాన్ డర్ డస్సెన్ (0), టోని డి జోర్జీ (28), హెన్రిచ్ క్లాసెన్ (6), ఎయిడెన్ మర్క్రమ్ (12), వియాన్ ముల్దార్ (0), డేవిడ్ మిల్లర్ (2) ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆఖర్లో ఫెలుక్వాయో (33) కాసేపు ఒంటరి పోరాటం చేయడం వల్ల సౌతాఫ్రికా స్కోర్ 100 పరుగులు దాటింది.
టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్ సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్
బెంబేలెత్తించిన అర్షదీప్, ఆవేశ్- టీమ్ఇండియా దెబ్బకు కుప్పకూలిన సఫారీ జట్టు