ETV Bharat / sports

ఇండోపాక్ సిరీస్​లకు PCB ఛైర్మన్ రిక్వెస్ట్- జై షా రిప్లై ఇదే! - భారత్ పాకిస్థాన్ మ్యాచ్

Ind vs Pak Bilateral Series: భారత్- పాకిస్థాన్ మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్​లు ప్రారంభించాలని పీసీబీ ఛైర్మన్ అష్రఫ్, జై షాను కోరారట. ఈ విషయాన్ని స్వయంగా అష్రఫ్ వెల్లడించారు.

Ind vs Pak Bilateral Series
Ind vs Pak Bilateral Series
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 4:22 PM IST

Updated : Jan 11, 2024, 4:45 PM IST

Ind vs Pak Bilateral Series: అంతర్జాతీయ క్రికెట్​లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్​కు ఉండే క్రేజ్ వేరు. దాయాదుల మధ్య మ్యాచ్ ఉందంటే, యావత్ క్రీడాలోకం టీవీలకు అతుక్కుపోతుంది. ఈ సమయంలో టీఆర్​పీ రేటింగ్స్​​ (TRP Ratings) కూడా ఎక్కువే. అయితే టెర్రర్ అటాక్​ల కారణంగా 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు పూర్తిగా రద్దయ్యాయి. టీమ్ఇండియా సైతం పాక్​ గడ్డపై క్రికెట్​ ఆడడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది.

అప్పటినుంచి భారత్- పాకిస్థాన్​ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్​లు లేవు. ఇరుజట్లు కేవలం ఐసీసీ ఈవెంట్​ (టీ20, వన్డే వరల్డ్​కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్)లోనే పోటీ పడతున్నాయి. అయితే ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్, భారత్- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'నేను రీసెంట్​గా బీసీసీఐ సెక్రటరీ జై షాను కలిశా. ఇండోపాక్ మధ్య ఎప్పటిలాగే ద్వైపాక్షిక సిరీస్​లు రీ స్టార్ట్​ చేద్దామని చెప్పాను. దీనికి షా సానుకూలంగా స్పందించారు. దానికి వారు భారత ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుందని షా అన్నారు. భారత్​లో లోక్​సభ ఎన్నికల తర్వాత ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్​ ఉంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేం ఆశిస్తున్నాం' అని అష్రఫ్ అన్నారు. ఇదే విషయంపై గతంలో భారత క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు ఆపేంత వరకు ఇండోపాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్​లు ఉండవని తేల్చి చెప్పారు.

  • "I met Jay Shah and he's ready to resume Pakistan vs India matches on regular basis, but he needs his government's approval. We are hopeful of some good news from India after the elections there this year" - Zaka Ashraf

    Kiya apko lagta hai Pakistan vs India bilateral series ho… pic.twitter.com/QHAXsAPaJZ

    — Tariq Khan 2.0 (@Khattar_02) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అదే ఆఖరుసారి: 2006లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్​కు వెళ్లి క్రికెట్ ఆడింది. ఆ తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ వెళ్లలేదు. ఇక ఐసీసీ ఈవెంట్​లలో కూడా పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే మ్యాచ్​లు తటస్థ దేశాల్లో జరిగాయి. రీసెంట్​గా 2023 ఆసియా కప్​నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, టీమ్ఇండియా ప్లేయర్లను భారత ప్రభుత్వం అక్కడికి పంపలేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్​లను తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించింది ఆసియా క్రికెట్ బోర్డు.

Ind vs Pak World Cup 2023 : టీమ్ఇండియా ఫ్యాన్స్​పై పాక్​ బోర్డు గుస్సా.. ఐసీసీకి ఫిర్యాదు?

Wasim Akram on Babar : 'కోహ్లీ జెర్సీలు అక్కడే తీసుకోవాలా?'​.. బాబర్​పై అక్రమ్​ ఫైర్​

Last Updated : Jan 11, 2024, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.