Ind vs Pak Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్‌లో భాగంగా శనివారం భారత్ పాకిస్థాన్ పోరులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్య (87 పరుగులు: 89 బంతుల్లో; 7x4, 1x6), యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (82 పరుగులు: 81 బంతుల్లో; 9x4, 2x6) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ 4, హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టారు.
-
After a shaky start, Pandya and Kishan showed immense resilience, scripting a remarkable recovery with their brilliant fifties. But wickets tumbled in clusters towards the end, leaving India with 266. 🤯
— AsianCricketCouncil (@ACCMedia1) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Can Pakistan chase down the target?#AsiaCup2023 #PAKvIND pic.twitter.com/Gg7gR4ozcj
">After a shaky start, Pandya and Kishan showed immense resilience, scripting a remarkable recovery with their brilliant fifties. But wickets tumbled in clusters towards the end, leaving India with 266. 🤯
— AsianCricketCouncil (@ACCMedia1) September 2, 2023
Can Pakistan chase down the target?#AsiaCup2023 #PAKvIND pic.twitter.com/Gg7gR4ozcjAfter a shaky start, Pandya and Kishan showed immense resilience, scripting a remarkable recovery with their brilliant fifties. But wickets tumbled in clusters towards the end, leaving India with 266. 🤯
— AsianCricketCouncil (@ACCMedia1) September 2, 2023
Can Pakistan chase down the target?#AsiaCup2023 #PAKvIND pic.twitter.com/Gg7gR4ozcj
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఘనమైన ఆరంభమేమీ దక్కలేదు. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది నిప్పులు చెరిగాడు. పదునైన పేస్ బౌలింగ్‌తో కెప్టెన్ రోహిత్(11), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(4) ని క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ వచ్చీ రాగానే రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించాడు. కానీ అయ్యర్ (14)ను హారిస్ రౌఫ్ వెనక్కిపంపాడు. కొద్దిసేపటికే శుభ్‌మన్ గిల్ (10) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లకు 66-4తో కష్టాల్లో పడింది.
ఆదుకున్న ఆ ఇద్దరు..
66-4తో ఉన్న భారత్‌ను ఇషాన్-హార్దిక్ ఆదుకున్నారు. స్ట్రైక్ రోటేట్ చేస్తూ.. క్రీజులో పాతుకుపోయారు. ఇక అనవసర షాట్లకు పోకుండా.. పాక్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వీలు చిక్కినప్పుడల్లా.. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో ఇషాన్ 54 బంతుల్లో.. కెరీర్లో ఏడో అర్ధ శతకం నమోదు చేశాడు. తర్వాత హార్దిక్ కూడా ఫిఫ్టీ పూర్తి చేశాడు.
-
Ishan Kishan departs, but only after a solid knock of 82 off 81 deliveries.
— BCCI (@BCCI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/L8YyqJF0OO… #INDvPAK pic.twitter.com/9goYe8sDO9
">Ishan Kishan departs, but only after a solid knock of 82 off 81 deliveries.
— BCCI (@BCCI) September 2, 2023
Live - https://t.co/L8YyqJF0OO… #INDvPAK pic.twitter.com/9goYe8sDO9Ishan Kishan departs, but only after a solid knock of 82 off 81 deliveries.
— BCCI (@BCCI) September 2, 2023
Live - https://t.co/L8YyqJF0OO… #INDvPAK pic.twitter.com/9goYe8sDO9
-
A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40
">A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40
ఇక ఇన్నిగ్స్ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఇషాన్‌ను హారిస్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 138 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత హార్దిక్.. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో షహీన్ మళ్లీ పాక్క బ్రేక్ ఇచ్చాడు. స్లో డెలివరీతో హార్దిక్‌ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత జడేజా(14)ను కూడా షహీన్ అదే ఓవర్లో ఔట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచాడు. చివర్లో బుమ్రా పోరటంతో భారత్ 266 పరుగులకు చేరుకుంది.