ETV Bharat / sports

మళ్లీ సూర్యనే నెం.1.. ధోనీ వల్లే అలా చేయడం నేర్చుకున్నాడట! - teamindia vs newzealand

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​ టీ20 ర్యాంకింగ్స్​లో తన హవా కొనసాగించాడు. మళ్లీ అగ్రస్థానంలోనే నిలిచాడు. అలానే మాజీ కెప్టెన్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు.

Surya kumar yadav T20 rankings
సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్
author img

By

Published : Feb 1, 2023, 3:31 PM IST

సూర్యకుమార్​ యాదవ్​ టీ20 ర్యాంకింగ్స్​లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లోనూ తన అగ్రస్థానాన్ని పదిల పరుచుకునన్నాడు. అయితే పాయింట్లలో మాత్రం కాస్త వెనకపడ్డాడు. న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో పిచ్​కు తగ్గట్టు ఎంతో జాగ్రత్తగా ఆడి 47 పరుగులతో 910 పాయింట్లు సంపాదించుకున్న అతడు.. రెండో మ్యాచ్​లో 26* నాటౌట్​గా నిలిచినప్పటికీ రెండు పాయింట్లు తగ్గిపోయాడు. 908 పాయింట్లలో నిలిచాడు.

ఇకపోతే ఈ బ్యాటర్ల విభాగంలో టాప్​-10లో సూర్య మినహా మరే ఇతర టీమ్​ఇండియా బ్యాటర్​ చోటు సంపాదించుకోలేదు. బౌలింగ్​ విభాగంలోనూ మొదటి పది స్థానాల్లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్​రౌండర్​ విభాగంలో హార్దిక్​ మూడో ర్యాంకులో నిలిచాడు.

ఇకపోతే వన్డే ర్యాంకింగ్స్​లో బ్యాటింగ్​ విభాగంలో శుభమన్​ గిల్​ ఆరు, కోహ్లీ ఏడు, రోహిత్ శర్మ తొమ్మిది స్థానాల్లో నిలవగా.. బౌలర్ల కేటగిరిలో సిరాజ్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ధోనీపై ప్రశంసలు.. టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌గా ఉన్న సూర్యకుమార్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. కీలకమైన రెండో మ్యాచ్‌లో విజయతీరాలకు చేర్చిన సూర్య.. సిరీస్‌ను తేల్చే మూడో టీ20లోనూ రాణించేందుకు సన్నద్ధమవుతున్నాడు. సవాల్‌ విసిరిన లఖ్‌నవూ ట్రాక్‌పై ఎలాంటి ఆందోళన లేకుండా జట్టును గెలిపించడంపై సూర్యకుమార్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ఈ విధంగా మాట్లాడాడు.

"న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ రాంచీలో ప్రారంభమైంది. అక్కడి నుంచే ప్రశాంతంగా ఉండే వైఖరివచ్చి ఉంటుంది. అయితే, నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టకముందు దేశవాళీ క్రికెట్‌ను భారీ స్థాయిలో ఆడాను. అది చాలా సహాయ పడింది. ఛాలెంజింగ్‌ విసిరే పిచ్‌ల మీదే ఆడటం బాగా ఉపయోగపడింది. అక్కడ ఏదైతే నేర్చుకొన్నానో.. దానినే ఇక్కడ అమలు చేస్తున్నా. సీనియర్ల ఆటను చూడటంతోపాటు, క్లిష్ట సమయాల్లో వారు ఎలా హ్యాండిల్‌ చేశారనేది వారి మాటల్లోనూ తెలుసుకోవడం కూడా కలిసొచ్చింది" అని సూర్యకుమార్‌ వెల్లడించాడు.

కాగా, మూడో మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడనున్నారు. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు ప్లేయర్లను ఈ మ్యాచ్​కు ముందు బీసీసీఐ సత్కరించనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​ ఈ మ్యాచ్​కు చీఫ్​ గెస్ట్​గా రానున్నాడు.

ఇదీ చూడండి: రూమర్స్​పై స్పందించిన ఉసేన్​ బోల్ట్​​.. అవన్ని నిజాలు కావంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.