ETV Bharat / sports

IND VS NZ: నాలుగో వన్డేలోనూ భారత్​కు తప్పని ఓటమి - teamindia women cricket team

IND VS NZ women cricket: ఇప్పటికే సిరీస్​ చేజార్చుకున్న టీమ్​ఇండియా.. న్యూజిలాండ్​తో జరిగిన నాలుగో వన్డేలోనూ ఓడిపోయింది. 63 పరుగుల తేడాతో పరాజయం చెందింది.

IND VS NZ
Teamindia loss the match in fourth ODI match
author img

By

Published : Feb 22, 2022, 12:27 PM IST

IND VS NZ women cricket: న్యూజిలాండ్​తో జరిగిన నాలుగో వన్డేలోనూ భారత మహిళా క్రికెట్​ జట్టు ఓడిపోయింది. 63 పరుగుల తేడాతో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచును 20ఓవర్లకు కుదించారు. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు అమెలియా కెర్​కు దక్కింది. ఈ విజయంతో ఐదు మ్యాచుల ఈ సిరీస్​లో న్యూజిలాండ్​ 4-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించలేకపోయింది. 17.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. రిచా ఘోష్​(52) టాప్​ స్కోరర్​. కెప్టెన్​ మిథాలీ రాజ్​(30) నామమాత్రంగా ఆడగా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్​ బౌలర్లలో హెలే జెన్సన్​ 3, అమెలియా కెర్​ 3, ఫ్లాన్సెస్​ మ్యాకే 2, జెస్​ కెర్​ 2 వికెట్లు దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన న్యుజిలాండ్​లో అమెలీయా కెర్​(68) హాఫ్​ సెంచరీతో మెరవగా.. బేట్స్​(41), సోఫీ డివైన్​(32), సాటర్​(satterthwaite, 32) రాణించారు. భారత బౌలర్లలో రేనుకా సింగ్​ 2, మేఘన సింగ్​, గైక్వాడ్​, దీప్తి శర్మ తలో వికెట్​ తీశారు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ​కాగా, ఐదో వన్డే ఫిబ్రవరి 24న జరగనుంది.

ఇదీ చూడండి: ఐపీఎల్​ మెగావేలంపై సీఎస్కే ప్లేయర్​ సంచలన వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.