టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బ్రేక్ చేశాడు న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా (Most Runs in T20 International) ఉన్న కోహ్లీని (3227 పరుగులు) అధిగమించాడు. శుక్రవారం భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా 31 పరుగులు చేసిన గప్తిల్ (Martin Guptill).. మొత్తంగా 3248 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
అయితే గప్తిల్ సగటు 32 కాగా, కోహ్లీ సగటు 52 ఉండటం విశేషం. ఈ జాబితాలో రోహిత్ శర్మ (3101 పరుగులు- కివీస్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో) మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ (2608), స్టిర్లింగ్ (2570) నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు.
ఇదీ చూడండి: Kohli De Villiers: డివిలియర్స్ రిటైర్మెంట్పై కోహ్లీ భావోద్వేగం