Ind vs nz test: టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 38 పరుగులతో నిలకడగా రాణించాడు. అతడు పుజారా(29) క్రీజులో ఉన్నారు. దీంతో సెషన్ ముగిసేసరికి భారత్ 69/0 పరుగులు చేసింది. ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంలో ఉంది.
కుప్పకూలిన కివీస్..
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఘోరంగా విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడిన కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.
Ajaz Patel Record: తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. టీమ్ఇండియా ఆటగాళ్లందరినీ తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. టెస్టులో పది వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.
ఇదీ చదవండి:
Ajaz Patel Record: నీకో దండం సామి.. 10 వికెట్లు ఎలా తీశావయ్యా!
భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిల.. 62 పరుగులకే ఆలౌట్
Ajaz Patel Record: 10 వికెట్ల క్లబ్లో అజాజ్.. దిగ్గజాల ప్రశంసలు