ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టెస్టు.. ఐదుగురు కొత్తవాళ్లతో టీమ్ఇండియా

భారత్, ఇంగ్లాండ్​ మహిళా జట్ల మధ్య జరుగుతోన్న ఏకైక టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. కెప్టెన్ హెదర్ నైట్ రాణించడం వల్ల ఇంగ్లీష్ జట్టు తొలి రోజు ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

author img

By

Published : Jun 17, 2021, 6:40 AM IST

ind eng
భారత్ ఇంగ్లాండ్

భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. కెప్టెన్‌ హెదర్‌ నైట్‌ (95; 175 బంతుల్లో 9×4) సత్తా చాటడం వల్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. టామీ బీమౌంట్‌ (66; 144 బంతుల్లో 6×4) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. నటాలీ సీవర్‌ (42), విన్‌ఫీల్డ్‌ హిల్‌ (35) రాణించారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ ఓ దశలో 230/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ భారత్‌ ఆఖర్లో పుంజుకుంది. 21 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చింది. స్పిన్నర్లు స్నేహా రాణా (3/77), దీప్తి శర్మ (2/50) ప్రత్యర్థిని దెబ్బతీశారు. సోఫియా డంక్లే (12), కేథరిన్‌ బ్రంట్‌ (7) క్రీజులో ఉన్నారు.

సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లాండ్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌: 269/6 (నైట్‌ 95, బీమౌంట్‌ 66, సీవర్‌ 42, విన్‌ఫీల్డ్‌ హిల్‌ 35; స్నేహ 3/77, దీప్తి 2/50)

ఐదుగురు అరంగేట్రం

ఈ మ్యాచ్​తో ఐదుగురు టీమ్ఇండియా క్రికెటర్లు టెస్టు అరంగేట్రం చేశారు. యువ విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma), ఆల్​రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma), పేసర్ పూజా వస్త్రాకర్, వికెట్ కీపర్ తానియా భాటియా ఇందులో ఉన్నారు. అలాగే తొలి టెస్టు ఆడుతోన్న స్నేహా రానాకు ఐదేళ్ల తర్వాత తుదిజట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ సోఫియా డ్రంక్లీ కూడా ఈ మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మహిళా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న తొలి నల్లజాతి మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇవీ చూడండి: Azharuddin: హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.