ETV Bharat / state

అమ్మాయి పెళ్లికి ప్రభుత్వ కానుక - కానీ వారికి మాత్రమే ఛాన్స్! - ఇలా అప్లై చేసుకోండి! - Marriage Gift Scheme in Telangana - MARRIAGE GIFT SCHEME IN TELANGANA

భవన నిర్మాణ రంగ కార్మికులకు శుభవార్త. ఇంట్లోని అమ్మాయిల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. పెళ్లి కానుకగా కొంత డబ్బును అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Marriage Gift Scheme in Telangana
Marriage Gift Scheme in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 12:41 PM IST

Marriage Gift Scheme for Girl in Telangana: ప్రస్తుత రోజుల్లో అన్ని ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రోజువారీ కూలీ పనులు చేసుకునే భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇంకా అమ్మాయిల పెళ్లి చేయాలంటే చెప్పనక్కర్లేదు.. అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికురాలు లేదా కార్మికుల కుటుంబంలో అమ్మాయిల వివాహానికి రూ. 30,000 అందిస్తోంది. మరి ఈ పెళ్లి కానుక అందుకునేందుకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హతలు:

  • ఈ పథకం తొలిసారి పెళ్లి చేసుకున్నవారికే మాత్రమే వర్తిస్తుంది.
  • పెళ్లి జరిగిన తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసి ఉండాలి.

కార్మికుల కుమార్తె వివాహం అయితే:

  • దరఖాస్తుదారురాల తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలిలో సభ్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
  • కేవలం ఇద్దరు కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • పెళ్లి జరిగేనాటికి కార్మికుల కుమార్తెకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి.
  • ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ గుర్తింపు పొందిన కార్మికులు అయితే, ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.

కార్మికురాలి వివాహం అయితే:

  • దరఖాస్తుదారురాలు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
  • అంతకుముందు పెళ్లి జరిగి ఉండకూడదు.
  • ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. పురుషుల వివాహాలకు వర్తించదు.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు

  • పాస్​పోర్ట్ సైజ్ ఫొటో
  • భవన నిర్మాణ కార్మికుడి గుర్తింపు కార్డ్
  • అమ్మాయి వయసు ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డ్ జిరాక్స్
  • వివాహ ఆహ్వాన పత్రిక
  • వివాహ వేడుక ఫొటోలు
  • వివాహ ధ్రువీకరణ పత్రం
  • రెన్యూవల్ చలానా కాపీ
  • బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్​

దరఖాస్తు విధానం

  • అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి అందులో డౌన్​లోడ్స్​లో Marriage Gift Scheme పై క్లిక్ చేయాలి.
  • అక్కడ కనిపించే అప్లికేషన్ ఫామ్​ను డౌన్​లోడ్ చేసి ప్రింట్ చేసుకోవాలి. లేదా కార్మిక శాఖ కార్యాలయంలో తీసుకోవచ్చు.
  • ఇప్పుడు దరఖాస్తు పత్రాన్ని తీసుకుని అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్​తో పాటు అడిగిన ఇతర పత్రాలను దానితో జత చేయాలి.
  • ఈ పత్రంపై సంతకం చేసి సంబంధిత కార్మిక శాఖ అధికారికి అందజేయాలి.
  • ఆ తర్వాత అధికారి వద్ద నుంచి దరఖాస్తు చేసినట్లుగా రిసిప్ట్ తీసుకోవాలి.

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా? - Construction Workers Scheme

క్యూఆర్​ కోడ్​తో ఫ్యామిలీ డిజిటల్​ కార్డు - కుటుంబం మొత్తానికి ఆధార్‌ తరహా ప్రత్యేక సంఖ్య - Family Digital Card with QR Code

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.