భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా బౌలర్ల ధాటికి ఆట ముగిసేసమయానికి బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజ్‌లో మెహిదీ మిరాజ్ (16*), ఎబాడట్ హోస్సేన్ (13*) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ఇంకా 271 పరుగులు వెనుకబడి ఉంది.
ఇదీ చూడండి: ఐపీఎల్ మినీ ఆక్షన్లో అతి చిన్న ప్లేయర్ ఎవరో తెలుసా?