ETV Bharat / sports

Ind vs Ban Test: క్లీన్​స్వీప్​పై టీమ్ఇండియా కన్ను.. డ్రాతో గట్టెక్కాలని షకీబ్ సేన ఆరాటం - ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ హైలైట్స్

2 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌ కోల్పోయినప్పటికీ తొలిటెస్టులో జయభేరి మోగించిన భారత జట్టు రెండో టెస్టులోనూ గెలుపొంది 2-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అటు బంగ్లాదేశ్‌ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని పట్టుదలగా ఉంది.

Ind vs Ban Test
Ind vs Ban Test
author img

By

Published : Dec 21, 2022, 10:46 PM IST

మిర్‌పుర్‌లోని షేర్-ఏ-బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. వేలికి గాయంతో తొలి టెస్టుకు దూరమైన సారథి రోహిత్‌ శర్మ.. రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రెండో మ్యాచ్‌కు సైతం కేఎల్‌ రాహుల్ సారథ్యం వహించనున్నారు. అయితే ప్రాక్టిస్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ చేతికి గాయమైనప్పటికీ.. అతడు మ్యాచ్‌కు అందుబాటులో ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాహుల్ ఫామ్‌ టీమ్‌ ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా రాహుల్‌ తన పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని ఆశిస్తోంది.

తొలి టెస్టులో సెంచరీలతో ఆకట్టుకున్న శుభ్‌మన్‌ గిల్‌, పుజారాలు ఈ మ్యాచ్‌లోనూ తమ ఫామ్‌ను కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీలతో భారత్ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. తన స్పిన్‌ మాయాజాలాన్ని రెండో టెస్టులోనూ... కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అశ్విన్‌, అక్షర్‌ పటేల్, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌లతో భారత బౌలింగ్ దళం బలంగా కనిపిస్తోంది.

మరోవైపు, భారత్‌పై ఇప్పటివరకు ఒక్కటెస్టు మ్యాచ్‌లోనూ నెగ్గని బంగ్లాదేశ్‌ జట్టు రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ డ్రా ముగించాలని పట్టుదలగా ఉంది. తొలి టెస్టులో చేసిన తప్పులను సరిదిద్దుకొని సిరీస్‌లో గొప్పగా పుంజుకోవాలని బంగ్లా ఆటగాళ్లు భావిస్తున్నారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ హసన్, లిట్టన్‌ దాస్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ భారత బౌలర్లకు సవాలు విసరనున్నారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న బంగ్లా కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌... మరోమారు భారత్‌కు కొరకాని కొయ్యగా మారే అవకాశముంది. ‌అల్‌రౌండర్‌ మెహిది హసన్‌ సైతం భారత్‌ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. తైజుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, ఖలీద్‌ అహ్మద్‌తో బంగ్లా బౌలింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.