ETV Bharat / sports

Ind Vs Ban Asia Cup : భారత్​ x బంగ్లాదేశ్.. ఫైనల్స్​కు ముందు ప్రాక్టీస్​ మ్యాచ్​.. కీలక మార్పులకు ఛాన్స్​! - ఇండియా వర్సెస్​ బంగ్లాదేశ్​ ఫైనల్స్

Ind Vs Ban Asia Cup : ఆసియా కప్ ఫైనల్​కు చేరిన భారత్​..​ సూపర్‌- 4లో భాగంగా బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. బంగ్లాతో జరిగే ఈ మ్యాచ్‌.. భారత్‌కు ఓ ప్రాక్టీస్​లా ఉపయోగపడుతుందని విశ్లేషకుల భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్​ ఎలా ఉండనుందంటే?

Ind Vs Ban Asia Cup
Ind Vs Ban Asia Cup
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 9:48 AM IST

Ind Vs Ban Asia Cup : ఆసియా కప్‌ సూపర్‌- 4లో భాగంగా జరగనున్న చివరి పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్థాన్‌, శ్రీలంకపై విజయాలతో ఫైనల్స్​కు చేరిన రోహిత్​ సేన.. శుక్రవారం బంగ్లాదేశ్‌తో మరో మ్యాచ్​కు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తమ జట్టులో కీలక మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. ఇతర క్రికెటర్లను పరీక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. రానున్న ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ పరిణామాలు జరగనున్నాయి. మరోవైపు సూపర్‌- 4లో పాక్‌, శ్రీలంకపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌.. ఈ టోర్నీని గెలుపుతో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీమ్​ఇండియా జట్టు.. బంగ్లాను తేలిగ్గా తీసుకోకూడదంటూ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.

శ్రేయస్.. ఈ మ్యాచ్​కైనా..​
Shreyas Iyer Asia Cup : ఇక క్రికెట్​ లవర్స్​కు.. బంగ్లాదేశ్‌తో పోరు కంటే కూడా ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ ఆడతాడా లేదా అన్న విషయంపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. వెన్నునొప్పికి కారణంగా క్రికెట్​కు దూరమైన ఈ స్టార్​ ప్లేయర్​.. శస్త్రచికిత్స నుంచి కోలుకున్నాక తిరిగి ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్​తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 14 పరుగులు చేశాడు. అయితే నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవసరమే రాలేదు. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా సూపర్‌- 4లో రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

అయితే ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు కనిపిస్తున్న శ్రేయస్‌.. బంగ్లాతో జరగనున్న మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్స్‌లోనూ అతను సౌకర్యవంతంగానే బ్యాటింగ్‌ చేశాడు. ఇక శ్రేయస్​ వస్తే.. ఇషాన్‌ కిషన్‌ బెంచ్​కు పరిమితమవ్వక తప్పదు. మరోవైపు బౌలర్ల విషయంలోనూ టీమ్‌ఇండియా మార్పులు చేసేలా కనిపిస్తోంది.

ఇక విజయంతో టోర్నీని ముగించాలని భావిస్తున్న బంగ్లా జట్టు కుడా తీవ్ర కసరత్తులు చేస్తోంది. వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీం స్వదేశం వెళ్లడం వల్ల భారత్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో లింటన్‌ దాస్‌ ఆడనున్నాడు. ఇక కెప్టెన్‌ షకీబ్‌ తన స్పిన్‌తో టీమ్‌ఇండియా బ్యాటర్లకు కళ్లెం వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తమీమ్‌ ఇక్బాల్‌, ఎబాదత్‌, నజ్మల్‌ శాంటో, ముష్ఫికర్‌ లేని తాజా బంగ్లా జట్టు కాస్త బలహీనపడిందనే చెప్పాలి.

పిచ్‌ ఎలా ఉందంటే ?
Ind VS Ban Pitch Report : కొలంబోలోని పి. ప్రేమదాస స్టేడియం భారత్​-బంగ్లా మ్యాచ్​కు వేదిక కానుంది. అయితే సూపర్‌- 4లో గత రెండు మ్యాచ్‌లనూ భారత్‌ ఈ స్టేడియంలోనే ఆడింది. అందులో పాక్‌తో మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌ బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. ఇక శ్రీలంకతో పోరు కోసం వాడిన పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే మందకొడి పిచ్‌ పైనే భారత్‌, బంగ్లా మ్యాచ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా మ్యాచ్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. అయితే ఆట పూర్తిగా రద్దు కాకపోవచ్చు.

Kuldeep Yadav ODI Wickets : కుల్​దీప్ @ 150.. తొలి భారత బౌలర్​గా చైనామన్ రికార్డు

Pak Vs SL Asia Cup 2023 : సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ ఓటమి.. లంకతోనే భారత్​ అమీతుమీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.