Ind vs Aus Women Test : ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు ఆఖరి రోజు ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌ల్లో (219/10, 261/10) అద్భత బౌలింగ్‌తో కట్టడిచేసిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో (406/10) భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ సేన 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (38*), జెమిమా రోడ్రిగ్స్ (12*) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, గార్డ్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టిన స్నేహ్ రాణాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
-
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 🏆#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BhE0fNDSIb
— BCCI Women (@BCCIWomen) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 🏆#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BhE0fNDSIb
— BCCI Women (@BCCIWomen) December 24, 2023𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 🏆#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BhE0fNDSIb
— BCCI Women (@BCCIWomen) December 24, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మూనీ (40), తాహిళ మెక్ గ్రాత్ (50), కెప్టెన్ హీలీ (38) మాత్రమే రాణించారు. చివర్లో కిమ్ గార్త్ (28) పర్వాలేదనిపించింది. ఇక భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బతీశారు.
ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు చేసి భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (40), స్మృతి మంధానా (74), రిచా ఘోశ్ (52), జెమిమా రోడ్రిగ్స్ (73), దీప్తి శర్మ (48), పూజా వస్ర్తకార్ (47) సమష్టిగా రాణించి జట్టుకు భారీ స్కోర్ కట్టబెట్టారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్నర్ 4, సుథర్లెడ్ 2, ఎల్లిస్ పెర్రీ 2, జనాసెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
187 పరుగులు ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఓపెనర్లు బెత్ మూనీ (33), లిచ్‌ఫీల్డ్ (18) మంచి ఆరంభం ఇచ్చారు. వీరి తర్వాత ఎలిస్ పెర్రీ (45), తహిళ మెక్ గ్రాత్ (73), హీలీ (32) రాణించారు. మిగతావారెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆసీస్ 261 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా4, రాజేశ్వరీ గైక్వాడ్ 2, హర్మన్ ప్రీత్ కౌర్ 2, పూజ ఒక వికెట్ పడగొట్టింది.
-
3⃣ wickets in the first innings 👌
— BCCI Women (@BCCIWomen) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
4⃣ wickets in the second! 😎
Congratulations to @SnehRana15 who is adjudged the Player of the Match in the #INDvAUS Test 👏👏
Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/x7PcTdIaMu
">3⃣ wickets in the first innings 👌
— BCCI Women (@BCCIWomen) December 24, 2023
4⃣ wickets in the second! 😎
Congratulations to @SnehRana15 who is adjudged the Player of the Match in the #INDvAUS Test 👏👏
Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/x7PcTdIaMu3⃣ wickets in the first innings 👌