ETV Bharat / sports

భారత్-పాక్ మ్యాచ్​కు రికార్డ్​ 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే - team india pakistan cricket match record viewership

IND vs PAK T20 viewership: టీమ్​ఇండియా​- పాకిస్థాన్ మ్యాచ్​(IND vs PAK T20) కోసం అభిమానులు ఎంతలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే టీ20 ప్రపంచకప్​ టోర్నీలో జరిగిన భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​కు రికార్డు స్థాయిలో వ్యూస్​ వచ్చాయి. టీ20 చరిత్రలోనే ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్​ ఈ మ్యాచ్​కు రావడం విశేషం.

భారత్- పాక్ మ్యాచ్​ వ్యూస్, IND vs PAK T20 viewership
భారత్- పాక్ మ్యాచ్​ వ్యూస్
author img

By

Published : Nov 25, 2021, 7:46 PM IST

Updated : Nov 25, 2021, 7:52 PM IST

IND vs PAK T20 viewership: భారత్​- పాకిస్థాన్​ మ్యాచ్​(IND vs PAK T20) అంటే క్రికెట్​ అభిమానులకు పండగే. ఈ జట్ల మ్యాచ్​ జరిగితే అభిమానులు టీవీలకే అతుక్కుపోతారు. 2021 టీ20 ప్రపంచకప్​లోనూ ఇదే జరిగింది. లీగ్​ దశలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్​కు(IND vs PAK T20 viewers) విశేష ఆదరణ లభించింది. ఏకంగా 167 మిలియన్ల (16.7 కోట్లు) మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు ఐసీసీ తెలిపింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

ఇండియాలో ఈ మ్యాచ్​ను 15.9 బిలియన్​ నిమిషాల పాటు చూసినట్లు చెప్పిన ఐసీసీ.. మొత్తం టోర్నీని 112 బిలియన్​ నిమిషాలు వీక్షించినట్లు వెల్లడించింది(team india pakistan cricket match). గతంలో 2016 టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్స్​ మ్యాచ్​కు (టీమ్​ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. యుకేలో మిగతా మ్యాచ్​లకు వచ్చిన వ్యూయర్​షిప్​ కన్నా భారత్​-పాక్​ మ్యాచ్​కు 60శాతం, ఈ టోర్నీకి ఏడు శాతం పెరిగినట్లు తెలిపింది.

ఈ మెగాటోర్నీకి వ్యూస్​ పెరగడంలో ఫేస్​బుక్​ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పింది ఐసీసీ. ఈ సామాజిక మాధ్యమం ద్వారా 4.3 బిలియన్​ వ్యూస్​ వచ్చినట్లు పేర్కొంది. ​

ఇదీ చూడండి: IND Vs NZ: శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​.. టీమ్​ఇండియా 258/4

Last Updated : Nov 25, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.