ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) విరాట్ కోహ్లీపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్(Axar Patel) అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ (Rohit Sharma), చెతేశ్వర్ పుజారా (Pujara), అజింక్యా రహానె (Ajinkya Rahane) వంటి సీనియర్లు ఉన్నారని తెలిపాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న రిషభ్ పంత్ కూడా ఉన్నాడని వెల్లడించాడు. విరాట్ లేనప్పటికీ ఆసీస్ సిరీస్‌లో కుర్రాళ్లు అదరగొట్టారని గుర్తుచేశాడు.
"కోహ్లీ (Virat Kohli) ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే కుర్రాళ్లు ఫామ్‌లో ఉన్నారు. విరాట్ లేకుండానే మన జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్ నెగ్గింది. ఇంగ్లాండ్ సిరీసులో అతడు త్వరగా ఔటైనా పంత్, సుందర్ అదరగొట్టారు. రోహిత్ శతకాలు బాదేశాడు. స్పిన్నర్లు కూడా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు"
-అక్షర్ పటేల్, టీమ్‌ఇండియా స్పిన్నర్.
"ఆస్ట్రేలియాలో శార్దూల్ ఠాకూర్, సుందర్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 400-500 వంటి భారీ స్కోర్లు ఛేదించాల్సిన అవసరం రాదు. స్కోర్లు 300 లేదా 250 వరకే ఉంటాయి. అందుకే లోయర్ ఆర్డర్ భాగస్వామ్యాలు చాలా అవసరం. పుజారా, కోహ్లీ, రోహిత్, రహానె, పంత్ టాప్ ఆర్డర్లో ఉన్నారు. ఆ ఐదుగురిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిగతా వాళ్లు పని పూర్తి చేయగలరు. భారత జట్టుకు ఆ సత్తా ఉంది. ఏ ఒక్కరి మీదో ఆధారపడదు. ఓపెనర్లు కాకుండా మిడిలార్డర్ లేదంటే లోయర్ ఆర్డర్ ఫలితాలను అందుకోగలదు" అని అక్షర్ తెలిపాడు.
ఇదీ చూడండి అక్షర్ కళ్లద్దాలతో ఆనంద్ మహీంద్ర.. చెప్పింది చేశాడుగా!
ఇదీ చూడండి జడ్డూ వల్లే జట్టులో చోటు దక్కలేదు: అక్షర్