ETV Bharat / sports

'ఫైనల్లో భారత్ గెలిస్తే జట్టులోని ప్రతి ఒక్కరికి ఓ ప్లాట్​'- బీజేపీ బంపర్ ఆఫర్​!​ - ప్రపంచకప్​ ఫైనల్​ 2023

World Cup Final 2023 : ప్రపంచకప్​ ఫైనల్లో భారత్ గెలిస్తే.. జట్టులోని సభ్యులకు ప్లాట్ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు గుజరాత్​కు చెందిన ఓ బీజేపీ నేత. కోచ్​తో సహా జట్టు సభ్యలకు కలిపి 16 ప్లాట్లు ఇస్తానని చెప్పారు.

World Cup Final 2023
World Cup Final 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 9:13 PM IST

Updated : Nov 19, 2023, 6:50 AM IST

World Cup Final 2023 : విశ్వవిజేత ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. ప్రపంచకప్​ ఫైనల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మ్యాచ్​ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్​కు చెందిన ఓ బీజేపీ నేత టీమ్​ఇండియాకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్​ మ్యాచ్​లో విజయం సాధిస్తే.. జట్టులోని సభ్యులకు ప్లాట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు కెయూర్​ ధోలారియా.

రాజ్​కోట్​లోని భయసార్​- ఖథ్​రోట్​ శివరామ్​ జెమినీ ఇండస్ట్రీస్​ జోన్​లోని 16 ప్లాట్లను ఇస్తానని చెప్పారు ధోలారియా. 15 జట్టలు సభ్యులతో పాటు కోచ్​ ద్రవిడ్​కు ఈ ప్లాట్లను ఇస్తానని వివరించారు. రూ. 10 లక్షల విలువైన ఈ ప్లాట్లలో అన్ని సదుపాయలను కల్పించామని చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐని సైతం సంప్రదిస్తున్నామని తెలిపారు. ఎవరైనా క్రికెటర్లు.. ఈ ప్లాట్లను తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని కోరినా చేస్తామన్నారు. 230 ప్లాట్లు కలిగిన ఈ వెంచర్​లో 16 ప్లాట్లను ఇప్పటికే క్రికెటర్ల కోసం రిజర్వ్ చేశామని చెప్పారు.

world cup final 2023
ప్లాట్ల మ్యాప్​
world cup final 2023
బీజేపీ నేత కెయూర్ ధోలారియా

ఫైనల్ కోసం ఘనంగా ఏర్పాట్లు
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది. టాస్‌ వేసిన అనంతరం 1: 35 గంటల నుంచి 1:50 వరకు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్ ఎయిర్‌బాటిక్ బృందం ఎయిర్‌షో కార్యక్రమం ఉంటుంది. మొదటి ఇన్సింగ్స్‌ డ్రింక్స్‌ విరామంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, గేయ రచయిత ఆదిత్య గద్వీతో సంగీత కార్యక్రమం, తొలి ఇన్నింగ్స్‌ విరామ సమయంలో ప్రీతమ్‌, తుషార్‌ జోషీ, జోనితా గాంధీ తదితరుల నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో ఇన్నింగ్స్‌ విరామ సమయంలో లేజర్, లైట్‌ షో ఉండనుంది. ఈ మ్యాచ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నారు.

మ్యాచ్‌ కోసం ప్రత్యేక రైళ్లు
మరోవైపు ప్రపంచ కప్‌ ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని అభిమానుల సౌకర్యార్థం అహ్మదాబాద్‌కు భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. శనివారం దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి మ్యాచ్‌ ముగిసిన మ్యాచ్ తర్వాత రైలు అహ్మదాబాద్ నుంచి తెల్లవారుజామున 2:30 గంటలకు దిల్లీకి బయలుదేరుతుంది. ముంబయి - అహ్మదాబాద్ మధ్య కూడా మ్యాచ్‌ కోసం మూడు రైళ్లను ఏర్పాటు చేసింది.

వరల్డ్​ కప్ ఫైనల్​ సమరం- టీమ్ఇండియాను కలవరపెడుతున్న సమస్యలివే!

వరల్డ్​ కప్​ మహాసంగ్రామం- వ్యూహాలకు టీమ్​ఇండియా పదును- 'బిలియన్ డ్రీమ్స్' సాకారమయ్యేనా?

Last Updated : Nov 19, 2023, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.