ETV Bharat / sports

Virat Kohli World Cup 2023 : రెండో మ్యాచ్​ కోసం టీమ్​ ఇండియా రెడీ.. ప్రత్యర్థి జట్టులో అతడితోనే కాస్త డేంజర్​! - ఇండియా వర్సెస్​ అఫ్గనిస్థాన్​ మ్యాచ్​లో విరాట్

Virat Kohli World Cup 2023 : ప్రపంచకప్​లో భాగంగా రెండో మ్యాచ్​ను సెప్టెంబర్ 11న అప్ఘానిస్థాన్​తో తలపడనుంది టీమ్​ ఇండియా. ఈ పోరులో టీమ్ ఇండియా ఎలా రాణిస్తుందో?

Virat Kohli World Cup 2023
Virat Kohli World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 5:00 PM IST

Virat Kohli World Cup 2023 : వరల్డ్ కప్​లో భాగంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ప్లేయర్లు ఏ మేరకు ఆడారో అందరికీ తెలిసిందే. 200 పరుగుల టార్గెట్​ను చేధించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు​.. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అంతటి నిరాశలోనూ ఆశాదీపంలా కేఎల్ రాహుల్​, విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే ఇప్పుడు టీమ్​ ఇండియా ఈ ప్రపంచకప్​లో తమ రెండో మ్యాచ్​ను.. దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​లోనూ... తొలి పోరులో అదరగొట్టిన కోహ్లీ - కేఎల్ రాహుల్​పైనే అందరీ కళ్లు ఉన్నాయి.

ఆ ఇద్దరిపైనే అందరి ఫోకస్​.. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో విరాట్ కోహ్లీ.. 85 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టి అందరి చేత మరోసారి ఔరా అనిపించుకున్నాడు. 'బెస్ట్ ఫీల్డర్‌ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే కేఎల్ రాహుల్​ కూడా 97 పరుగులతో అజేయంగా నిలిచి తనేంటో మరోసారి అందరికీ తెలియజేశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో ఈ ఇద్దరు.. అప్ఘాన్​తో మ్యాచ్​లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తారని, మెరుపులను మెరిపిస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేఎల్ రాహుల్​ వికెట్​ కీపింగ్​లోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక జ్వరం కారణంగా శుభ్​మన్​ గిల్​.. రెండో మ్యాచ్​కు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో తొలి మ్యాచ్​లో ఓపెనర్లుగా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషనే జోడీయే కొనసాగనుంది. తొలి మ్యాచ్​లో వీరితో పాటు విఫలమైన శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్​లో రాణించాల్సి ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. మొదటి మ్యాచ్​ ఫామ్​నే ఇక్కడ కూడా కొనసాగిస్తే తిరుగుండదు. ముఖ్యంగా మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు పతనం శాసించిన లెఫ్ట్ ఆర్మ్​ స్పిన్నర్​ రవీంద్ర జడేజా అదే దూకుడును కొనసాగించాలి. ఇక అప్ఘానిస్థాన్ విషయానికొస్తే.. ఆ జట్టులో స్పిన్నర్ రషీద్ ఖాన్​ దూకుడుగా ఉన్నాడు. అతడితో పాటు మిగతా జట్టు ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.

Virat Kohli Stats : ఛేదన అంటే రెచ్చిపోతాడు..​ కోహ్లీ సాధించిన ఈ సంచలన ఇన్నింగ్స్​ మరవగలమా?

Virat Kohli Medal : సూపర్​మ్యాన్​లా క్యాచ్ అందుకున్న విరాట్.. మెడల్ కొట్టేశాడుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.