SL vs AFG World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అప్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలకం 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్గాన్ నిలకడగా ఆడుతూ 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అప్గాన్ బ్యాటర్లు రహమత్ షా (62; 74 బంతుల్లో 7x4), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58*; 74 బంతుల్లో 2x4, 1x6), అజ్మతుల్లా (73*; 63 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఓపెనర్ ఇబ్రహీం జద్రన్ (39; 57 బంతుల్లో 4x4, 1x6) రాణించాడు. మరో ఓపెనర్ రహ్మదుల్లా గుర్బాజ్(0) డకౌట్ అయ్యాడు. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. కాసున్ రజితా ఒక వికెట్ తీశాడు.
-
Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune 👊#AFGvSL 📝: https://t.co/2lhrckvJl8 pic.twitter.com/bSSXPZHUJe
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune 👊#AFGvSL 📝: https://t.co/2lhrckvJl8 pic.twitter.com/bSSXPZHUJe
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune 👊#AFGvSL 📝: https://t.co/2lhrckvJl8 pic.twitter.com/bSSXPZHUJe
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (46; 60 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3x4), సదీర సమరవిక్రమార్క (36; 40 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించారు. ఎంజొలో మాథ్యూస్ (23; 26 బంతుల్లో 1x4, 1x6), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. టెయిలెండర్ మహీశ్ తీక్షణ (29; 31 బంతుల్లో 3x4, 1x6) పోరాడాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
వరల్డ్ కప్‌లో మరో సంచలనం..
అఫ్గాన్ 2023 వరల్డ్‌కప్ కన్నా ముందు పలు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొంది. అందులో ఏ వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ 2023 వరల్డ్ కప్‌లో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచి చిరిత్ర సృష్టించిన అఫ్గాన్.. ఆ తర్వాత పాకిస్థాన్‌ను చిత్తు చేసి సంచలం సృష్టించింది. తాజా విక్టరీతో ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడింటిని కైవసం చేసుకుంది. దీంతో 6 పాయింట్లతో సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
Hardik Pandya Injury : టీమ్ఇండియాకు శుభవార్త.. జట్టులోకి హార్దిక్ పాండ్య ఎంట్రీ అప్పుడే!
Shami World Cup Wickets : సూపర్ ఫామ్‌లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..