ODI World Cup SL vs AUS : ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడా ఓటమిపాలైంది. దీంతో లంక ప్రపంచకప్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వేతో పాటు చేరింది. ప్రస్తుతం ఈ రెండు టీమ్‌లు ప్రపంచకప్‌లో 42 పరాజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. 35 మ్యాచ్‌ల ఓటమితో మూడో స్థానంలో వెస్టిండీస్ ఉంది. 34 పరాజయాలతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో నిలచాయి.
వెన్నునొప్పితో బరిలోకి దిగి.. ప్రపంచ కప్‌లో శ్రీలంకపై ఆసీస్ గెలిచి ఖాతాను ఓపెన్ చేసింది. ఈ ఎడిషన్‌లో ఆసీస్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమినే చవిచూసింది. లంకపై జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మొదట్లో తడపడినా.. ప్రత్యర్థులను ఎదుర్కొని విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆడమ్ జంపా. వెన్ను నోప్పితో బాధపడుతూనే బరిలోకి దిగి.. ప్రస్తుత ప్రపంచకప్‌లో తన జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు. నొప్పిని దిగమింగుతూనే కీలక వికెట్లు పడగొట్టి లంక పరాజయానికి కారణమైయ్యాడు.
-
Adam Zampa's leg-spin magic helped him to four wickets in Lucknow 🪄
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It also wins him the @aramco #POTM 👊#CWC23 | #AUSvSL pic.twitter.com/ygsuN9LgnZ
">Adam Zampa's leg-spin magic helped him to four wickets in Lucknow 🪄
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
It also wins him the @aramco #POTM 👊#CWC23 | #AUSvSL pic.twitter.com/ygsuN9LgnZAdam Zampa's leg-spin magic helped him to four wickets in Lucknow 🪄
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
It also wins him the @aramco #POTM 👊#CWC23 | #AUSvSL pic.twitter.com/ygsuN9LgnZ
ఫామ్‌లో ఉన్న శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చమిక కరుణరత్నేలతో పాటు తీక్షణ వికెట్లను జంపా పడగొట్టాడు. మెండిస్, సమరవిక్రమలను వెంటవెంటనే జంపా పెవిలియన్‌కు పంపించాడు. ఆఖర్లో రెండు పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. నొప్పిని భరస్తూనే నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
అయితే ఆసీస్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో జంపా సరైన ప్రదర్శన చేయలేదు. టీమ్ఇండియా జరిగిన తొలి మ్యాచ్‌లో జంపా.. ఒక్క వికెట్ కూడా తీయకుండా53 పరుగులు ఇచ్చాడు. తర్వాత తలపడిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు ఇచ్చాడు.
-
Five-time ICC Men's Cricket World Cup champions Australia opened their account in #CWC23 with a solid victory over Sri Lanka 💪
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 👇https://t.co/JPAQlkUD4J
">Five-time ICC Men's Cricket World Cup champions Australia opened their account in #CWC23 with a solid victory over Sri Lanka 💪
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
Details 👇https://t.co/JPAQlkUD4JFive-time ICC Men's Cricket World Cup champions Australia opened their account in #CWC23 with a solid victory over Sri Lanka 💪
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2023
Details 👇https://t.co/JPAQlkUD4J
Australia Vs Sri lanka World Cup 2023 : ఎట్టకేలకు బోణీ కొట్టిన కంగారూలు.. శ్రీలంక హ్యాట్రిక్ ఓటమి
ODI World Cup 2023 Semi Final : సెమీస్ రేస్.. లెక్క తప్పింది సార్.. వేడి రాజుకుంది!