ICC T20 Ranking: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ కెరీర్ బెస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. 739 రేటింగ్స్‌తో ఏడు స్థానాలు ఎగబాకి ప్రస్తుతం అరో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. అతడు ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 667 రేటింగ్స్‌తో ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ (869 రేటింగ్స్) అగ్రస్థానంలో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ (661)తో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శివమ్ దూబే 256వ ప్లేస్ నుంచి 58వ స్థానానికి జంప్ చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 516 రేటింగ్స్‌తో 44వ స్థానంలో ఉన్నాడు.
టాప్- 5 స్థానల్లో ఉన్న బ్యాటర్లు
- సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 869 రేటింగ్స్
- ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)- 802 రేటింగ్స్
- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)- 775 రేటింగ్స్
- బాబర్ ఆజామ్ (పాకిస్థాన్)- 763 రేటింగ్స్
- ఎయిడెన్ మర్క్రమ్ (సౌతాఫ్రికా)- 755 రేటింగ్స్
ఇక బౌలింగ్ విభాగానికొస్తే: యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారిపోయాడు. ప్రస్తుతం బిష్ణోయ్ 666 రేటింగ్స్‌తో ఆరో పొజిషన్లో ఉన్నాడు. టాప్ 10లో అక్షర్, బిష్ణోయ్ తప్పా టీమ్ఇండియా ప్లేయర్లెవరూ లేరు. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 726 రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
టాప్- 5 స్థానల్లో ఉన్న బౌలర్లు
- ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్)- 726 రేటింగ్స్
- ఆఖీల్ హొస్సెన్ (వెస్టిండీస్)- 683 రేటింగ్స్
- వానిందు హసరంగ (శ్రీలంక)- 680 రేటింగ్స్
- మహీశ్ తీక్షణ (శ్రీలంక)- 680 రేటింగ్స్
- అక్షర్ పటేల్ (భారత్)- 667 రేటింగ్స్
2024 టీ20 వరల్డ్‌కప్ దాకా టాప్‌లోనే సూర్య! బ్యాటింగ్ విభాగంలోలో 869 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్న సూర్య ఉండగా, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ సాల్ట్ 802 రేటింగ్స్‌తో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అంటే వీరిద్దరి మధ్య ఏకంగా 67 రేటింగ్స్ తేడా ఉంది. దీంతో పొట్టి ప్రపంచకప్ దాకా సూర్య టాప్ పొజిషన్లో కొనసాగే ఛాన్స్ ఉంది.
-
Sri Lanka and India stars command the spotlight in a host of changes in the latest ICC Men's Player Rankings 📝
— ICC (@ICC) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Read on 👇 https://t.co/kKr1r8VOm5
">Sri Lanka and India stars command the spotlight in a host of changes in the latest ICC Men's Player Rankings 📝
— ICC (@ICC) January 17, 2024
Read on 👇 https://t.co/kKr1r8VOm5Sri Lanka and India stars command the spotlight in a host of changes in the latest ICC Men's Player Rankings 📝
— ICC (@ICC) January 17, 2024
Read on 👇 https://t.co/kKr1r8VOm5
టాప్ పొజిషన్‌కు గిల్ - కెరీర్లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్