ETV Bharat / sports

ICC Rankings: సూర్య జోరు.. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​ - సూర్యకుమార్​ యాదవ్​ ఐసీసీ

ICC Rankings Surya kumar yadav: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​కు చేరుకున్నాడు.

ICC Rankings Surya kumar yadav
సూర్య జోరు.. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​
author img

By

Published : Aug 10, 2022, 4:02 PM IST

ICC Rankings Surya kumar yadav: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెరీర్‌లోనే.. అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 816 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 818 పాయింట్లతో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.

వెస్టిండీస్‌ టీ-20 సిరీస్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ తమ ర్యాంకులను గణనీయంగా మెరుగు పరుచుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో ఆరు స్థానాలు ఎగబాకిన శ్రేయస్‌, తాజా ర్యాంకింగ్స్‌లో 19వస్థానంలో నిలిచాడు. పంత్‌ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని 59వ ర్యాంకుకు చేరుకున్నాడు.

భారత బౌలర్లలో రవి బిష్ణోయి 50 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి, కుల్‌దీప్ యాదవ్‌ 58 స్థానాలు మెరుగుపరుచుకొని, 87వ స్థానానికి చేరాడు. భువనేశ్వర్‌ కుమార్‌ ఒక స్థానం దిగజారి తొమ్మిదికి పడిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ హాజిల్‌వుడ్‌, అఫ్గాన్‌ ఆటగాడు మెుహమ్మద్‌ నబీ టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: Sanju Samson: సంజు నీకే ఎందుకిలా జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.