ICC ODI World Cup 2023 Schedule : అంతా ఊహించినట్లుగానే జరిగింది. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఆయా జట్ల రిక్వెస్ట్‌తో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రీషెడ్యూల్ చేసింది. ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ రీషెడ్యూల్ తేదీలను పేర్కొన్నాయి.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఒక్క రోజు ముందుకు జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగానే నిర్వహించనున్నారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని, ఆ సమయంలో భారత్-పాక్ మ్యాచ్‌కు సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు బీసీసీఐకి తెలియజేశారు. దీంతో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసింది.
ICC ODI World Cup 2023 Update : మూడు రోజుల క్రితం ఆయా క్రికెట్ అసోసియేషన్స్‌తో సమావేశం నిర్వహించిన బీసీసీఐ సెక్రటరీ జై షా రీషెడ్యూల్‌పై సంకేతాలు ఇచ్చారు. మూడు దేశాలు తమ మ్యాచ్‌ల తేదీలను మార్చాలని కోరారని పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న పాకిస్థాన్-నెదర్లాండ్, పాకిస్థాన్ శ్రీలంక మ్యాచ్‌ల తేదీల్లోనూ స్వల్ప మార్పులు జరిగాయి. అయితే ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 6న, పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. బుధవారం రీషెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ICC ODI World Cup 2023 Teams : మొత్తం 10 జట్లతో.. ఈ వన్డే ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే టీమ్ఇండియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. మరో రెండు జట్ల కోసం.. ప్రస్తుతం జింబాబ్వే వేదికగా క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ పోరులో ఫైనల్‌కు చేరిన జట్లు.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.