ICC ODI Rankings 2023 : ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బుధవారం వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 863 పాయింట్లతో టాప్‌లోనే కొనసాగుతున్నాడు. భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ (759 పాయింట్లు) తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 707 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (715 పాయింట్లు).. ఒక ప్లేస్ పడిపోయి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
టాప్ 5 బ్యాటర్లు
- శుభ్‌మన్ గిల్ (భారత్) 759 పాయింట్లు
- రస్సీ వాన్ డర్ డస్సెన్ (సౌతాఫ్రికా) 745 పాయింట్లు
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 739 పాయింట్లు
- ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) 735 పాయింట్లు.
నాలుగేళ్లలో తొలిసారి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ముగ్గురు టీమ్ఇండియా బ్యాటర్లు (గిల్, విరాట్, రోహిత్) ఉన్నారు. ఇలా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చివరిసారిగా 2019 జనవరిలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు రోహిత్, విరాట్, శిఖర్ ధావన్ ఈ ముగ్గురు టాప్ 10లో స్థానం సంపాదించారు. ఆ తర్వాత మరెప్పుడు కూడా ఈ జాబితాలో టీమ్ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్ 10లో లేరు.
10లో ఆరుగురు భారత్-పాకిస్థాన్ ప్లేయర్లు..
ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో భారత్,పాకిస్థాన్ బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో ఇరుజట్ల నుంచి ఆరుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. పాక్ నుంచి బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ (705 పాయింట్లు).. భారత్ నుంచి గిల్, విరాట్, రోహిత్ ఉన్నారు.
బౌలింగ్ విభాగంలోనూ కూడా టాప్ ప్లేస్‌లో మార్పు లేదు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్‌వుడ్ 692 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (656 పాయింట్లు), పేసర్ మహమ్మద్ సిరాజ్ (643)తో ఏడు, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.
టాప్ 5 బౌలర్లు..
- మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 666 పాయింట్లు
- ట్రెంట్ బోల్ట్ (న్యూజిలాండ్) 666 పాయింట్లు
- ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) 663 పాయింట్లు
- మాట్ హెన్రీ (న్యూజిలాండ్) 658 పాయింట్లు
-
Race for the top spot heats up 🔥
— ICC (@ICC) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India’s top performers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s ODI Batting Rankings.#ICCRankings | Details 👇https://t.co/AmRI1lbFBG
">Race for the top spot heats up 🔥
— ICC (@ICC) September 13, 2023
India’s top performers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s ODI Batting Rankings.#ICCRankings | Details 👇https://t.co/AmRI1lbFBGRace for the top spot heats up 🔥
— ICC (@ICC) September 13, 2023
India’s top performers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s ODI Batting Rankings.#ICCRankings | Details 👇https://t.co/AmRI1lbFBG
-
Kuldeep Yadav ODI Wickets : కుల్దీప్ @ 150.. తొలి భారత బౌలర్‌గా చైనామన్ రికార్డు