ICC Men's Test Ranking : ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో.. బ్యాటర్ల విభాగంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇదివరకు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్ లుబూషేన్ను (877) వెనక్కునెట్టి.. రూట్(887) ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బౌలర్ల జాబితాలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (860) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
-
We have a new No.1 Test batter 🎉
— ICC (@ICC) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The latest @MRFWorldwide ICC Men’s Player Rankings have thrown up a big surprise 👇https://t.co/XvrnVBPsCq
">We have a new No.1 Test batter 🎉
— ICC (@ICC) June 21, 2023
The latest @MRFWorldwide ICC Men’s Player Rankings have thrown up a big surprise 👇https://t.co/XvrnVBPsCqWe have a new No.1 Test batter 🎉
— ICC (@ICC) June 21, 2023
The latest @MRFWorldwide ICC Men’s Player Rankings have thrown up a big surprise 👇https://t.co/XvrnVBPsCq
టాప్ - 5లో ఉన్న బ్యాటర్లు వీళ్లే..
- న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (883) అనూహ్యంగా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
- ఆస్ట్రేలియా బ్యాటర్ లుబూషేన్ (877) రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు.
- డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత్‌పై సెంచరీ సాధించిన ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (873) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు.
- పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (862) పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
యాషెస్ సిరీస్ మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ ఖవాజా (836).. రెండు స్థానాలను మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమ్ఇండియా నుంచి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (758) ఒక్కడే టాప్ -10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా 25వ, అజింక్య రహానే 36వ, శ్రేయస్ అయ్యర్ 37వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
- Rohit Sharma Test Ranking : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 729 పాయింట్లతో 12వ ప్లేస్‌లో ఉన్నాడు.
- Virat Kohli Test Ranking : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ ర్యాంకు కోల్పోయి 700 పాయింట్లతో 14వ స్థానానికి పడిపోయాడు.
టెస్టు బౌలర్ల జాబితాలో మార్పులు స్వల్పంగానే జరిగాయి. టీమ్‌ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 860 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (829) పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సౌత్ఆఫ్రికా పేస్ బౌలర్ కగిసొ రబాడా ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని (825) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇక చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉంటోన్న భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (772) పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. కాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (765) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ -5లో ముగ్గురు టీమ్ఇండియా ఆటగాళ్లు ఉండడం విశేషం. 434 పాయింట్లతో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 352, అక్షర్ పటేల్ 310 పాయింట్లతో.. రెండు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అటు బౌలర్ల జాబితాలో, ఇటు ఆల్ రౌండర్ల లిస్ట్‌లో టాప్ - 10లో స్థానం సంపాదించుకున్నారు.
యాషెస్ 2023.. ప్రతిష్టాత్మక యాషెస్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాట్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో ఆసిస్ ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జూన్ 28న ప్రారంభం కానుంది.