ETV Bharat / sports

ICC Latest T20 Rankings : ర్యాంకింగ్​లోకి దూసుకొచ్చిన జైస్వాల్​​.. కెరీర్​ బెస్ట్​లో గిల్​.. - జైశ్వాల్ టీ20 తాజా ర్యాంకింగ్స్​

ICC Latest T20 Rankings : తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో గిల్​-జైస్వాల్​​.. ​ కెరీర్​లో బెస్ట్ ర్యాంక్​ను అందుకున్నారు! ఆ వివరాలు..

ICC Latest T20 Rankings : గిల్​ కెరీర్​ బెస్ట్ ర్యాంక్​.. జైశ్వాల్​ మరింత ముందుకు
ICC Latest T20 Rankings : గిల్​ కెరీర్​ బెస్ట్ ర్యాంక్​.. జైశ్వాల్​
author img

By

Published : Aug 16, 2023, 4:16 PM IST

Updated : Aug 16, 2023, 5:05 PM IST

ICC Latest Gill T20 Rankings : టీమ్​ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్​ ఓ ఘనత అందుకున్నాడు. తాజా టీ20 ర్యాంకింగ్స్​లో కెరీర్​ బెస్ట్ 25వ ర్యాంకును అందుకున్నాడు. వెస్టిండీస్​తో జరిగిన ఐదు మ్యాచుల సిరిసీలో చివరి రెండు గేమ్స్​లో 77,9 స్కోరు చేసిన గిల్​.. 43 స్థానాలు ఎగబాకి ఈ మార్క్​ను అందుకున్నాడు. అంతకుముందు అతడు అహ్మదాబాద్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 126 బాది కెరీర్​ బెస్ట్ 30వ పొజిషన్​లో ఉండేవాడు.

Yashasvi Jaiswal T20 Rankings : వెస్టిండీస్​తో జరిగిన నాలుగో మ్యాచ్​లో గిల్(77; 47 బంతుల్లో 3×4, 5×6)​.. జైశ్వాల్(84నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 3×6) కలిసి మొదటి వికెట్​కు 165 పరుగులు జోడించారు. టీమ్​ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక మొదటి వికెట్ భాగస్వామం నెలకొల్పిన రోహిత్ - రాహుల్ రికార్డ్​ను(165 పరుగులు) సమం చేశారు. ఈ మార్క్​ ఇన్నింగ్స్​తో జైస్వాల్​​.. ​​ర్యాంకింగ్స్​లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం 88వ స్థానాన్ని చేరుకున్నాడు. స్పిన్నర్ కుల్దీప్​​ యూదవ్​ 23 ర్యాంకులు ముందుకు జరిగి 28వ స్థానానికి చేరుకున్నాడు. నాలుగో మ్యాచ్​లో రెండు వికెట్లు పడగొట్టి కుల్దీవ్​ ఈ ర్యాంకును అందుకున్నాడు. ఈ నాలగు మ్యాచ్​లో భారత్​ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐదో మ్యాచ్​లో ఓడిపోయి.. 2-3 తేడాతో సిరీస్‍ను కోల్పోయింది.

మొత్తంగా ఈ తాజా ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా ప్లేయర్స్​ సత్తా చాటారు. ఎప్పటిలానే సూర్యకుమార్‌ యాదవ్ 907 పాయింట్లతో ఈ టీ20ల్లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే టాప్‌ -10లో సూర్యకుమార్‌ తప్ప ఇతర మరే టీమ్​ఇండియా క్రికెటర్‌కు చోటు దక్కించుకోలేదు. రెండో ర్యాంక్‌లో 811 పాయింట్లతో ఉన్న మహమ్మద్ రిజ్వాన్​కు సూర్యకుమార్‌ పాయింట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంది. ఇకపోతే వెస్టిండీస్​ టూర్​లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన తిలక్‌ వర్మ 509 పాయింట్లతో 46వ స్థానాన్ని దక్కించుకున్నాడు. యశస్వి జైస్వాల్ 395 పాయింట్లతో 88వ ర్యాంక్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్‌ విభాగంలో మాత్రం మొదటి పది స్థానాల్లో టీమ్‌ఇండియా ప్లేయర్స్​ లేరు. అయితే ఆల్‌రౌండర్‌ విభాగంలో మాత్రం హార్దిక్‌ పాండ్య 250 పాయింట్లతో రెండో ర్యాంకును అందుకున్నాడు.

ICC Latest Gill ODI Rankings : వన్డేఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్ 743 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 705 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ వన్డే బౌలర్ల విభాగంలో మహమ్మద్ సిరాజ్ 670 పాయింట్లతో నాలుగు స్థానంలో, కుల్‌దీప్‌ యాదవ్ 622 పాయింట్లతో పదో ర్యాంకులో నిలిచారు.

ఇంకా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టీమ్​ఇండియా 264 రేటింగ్‌ పాయింట్లు ర్యాంక్‌ మాత్రం అలానే ఉంది. అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే ఇంగ్లాండ్‌ నుంచి 259 రేటింగ్​ పాయింట్లతో తీవ్ర పోటీ నెలకొంది. న్యూజిలాండ్​తో జరగనున్న టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే ఈ స్థానాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో అయితే టీమ్​ఇండియా 113 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా 118 పాయింట్లతో కొనసాగుతుండగా, పాకిస్థాన్‌ 116 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉంది.

Ind vs Wi 4th T20 : అదరగొట్టిన ఓపెనర్లు.. విండీస్​ను చిత్తు చేసిన భారత్.. 2 - 2 తో సిరీస్ సమం

Last Updated : Aug 16, 2023, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.