ETV Bharat / sports

'ఐపీఎల్​ నుంచి నేనే వెళ్లిపోదామనుకున్నా'

తన తల్లిదండ్రులకు కరోనా నిర్ధరణ అయిందని తెలియగానే ఐపీఎల్​ నుంచి వెళ్లిపోదామనుకున్నట్లు ఆర్సీబీ బౌలర్ చాహల్ వెల్లడించాడు. వీలైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు.

Yuzvendra Chahal, team india spinner
యుజ్వేంద్ర చాహల్, టీమ్ఇండియా స్పిన్నర్
author img

By

Published : May 21, 2021, 6:09 PM IST

ఒక వేళ ఐపీఎల్ నిరవధిక వాయిదా పడి ఉండకపోతే.. తాను లీగ్​ నుంచి విరామం తీసుకునేవాడినని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్ అని తెలియగానే ఆటపై శ్రద్ధ పెట్టలేకపోయినట్టు పేర్కొన్నాడు. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్లాలని యోచించినట్లు తెలిపాడు.

"నా తల్లిదండ్రులకు కరోనా సోకిందని తెలియగానే.. ఐపీఎల్​ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నాను. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా జరిగితే ఆటపై దృష్టి సారించడం చాలా కష్టమవుతుంది. మే 3న వారిద్దరికీ వైరస్ నిర్ధరణ అయింది. తర్వాత రోజే లీగ్​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది."

-యుజ్వేంద్ర చాహల్, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్.

ఇటీవలే కొవిడ్ నుంచి తన తల్లి కోలుకున్నప్పటికీ.. తన తండ్రి పరిస్థితి మాత్రం క్షీణించిందని చాహల్ వెల్లడించాడు. ఆయనను గుర్గాన్​లోని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపాడు.

ఇదీ చదవండి: కరోనాతో ఏఎఫ్​ఐ మెడికల్ ఛైర్మన్ మృతి

"మా నాన్న ఆక్సిజన్ లెవెల్స్​ 85-86కి పడిపోయాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించాము. నిన్ననే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అయినప్పటికీ, అతనికి వైరస్​ ఉన్నట్లు తేలింది. ఏదేమైనా అతని ఆక్సిజన్ లెవెల్స్​ 95-96కి చేరుకోవడం శుభపరిణామం. ఇది కొంత ఉపశమనం ఇచ్చింది. ఆయన మెరుగవ్వడానికి ఇంకో 7-10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది" అని చాహల్ తెలిపాడు.

ఐపీఎల్​ 14ల సీజన్​లో వరుసగా కరోనా కేసులు బయటపడ్డాయి. పలువురు క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో లీగ్​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్​ వాయిదా పడిన నేపథ్యంలో లీగ్​ నిర్వహణకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని చాహల్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్​లో మిగిలిన లీగ్​ను జరపాలని బీసీసీఐ కూడా భావిస్తోన్నట్లు తెలిపాడు. భారత్​ నుంచి ఆతిథ్య వేదిక యూఏఈకి తరలిపోయినా.. టీ20 ప్రపంచకప్​ గెలిచే సత్తా భారత్​కు ఉందని చాహల్ పేర్కొన్నాడు. ​ ​

ఇదీ చదవండి: ఐపీఎల్​ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.