ఈసారి ఐపీఎల్ ప్రారంభంలోనే గాయపడిన తాను కోలుకోవడానికి మరో తొమ్మిది వారాలు పట్టనుందని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బెన్‌స్టోక్స్ చెప్పాడు. కరోనా కారణంగా ఇటీవల నిరవధిక వాయిదా పడిన ఈ లీగ్‌ను సెప్టెంబరులో తిరిగి పెట్టొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ టోర్నీ నిర్వహించే సమయానికి తాను పూర్తి ఫిట్నెస్ సాధించినా అందుబాటులో ఉండనని చెప్పాడు. వచ్చే సీజన్ మాత్రం కచ్చితంగా ఆడతానని అన్నాడు.
"ఈ మెగాలీగ్ను కొనసాగించే విషయంపై స్పష్టత లేదు. కానీ మా బోర్డు మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడటం కష్టమని చెప్పింది. వచ్చే ఏడాది పూర్తి సీజన్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. కోలుకోవడానికి ఇంకా మూడు నెలలు పడుతుందని చెప్పారు. కానీ దాదాపు తొమ్మిది వారాల్లో కోలుకుంటాననే దృఢ నిశ్చయంతో ఉన్నాను. అయితే కచ్చితమైన తేదీ చెప్పలేను కానీ తిరిగి ఆడేందుకు మానసికంగా సిద్ధమవుతున్నాను."
-స్టోక్స్, ఇంగ్లాండ్ క్రికెటర్.
కరోనా కారణంగా ఈ ఐపీఎల్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ఈ మెగాలీగ్ రెండో దశను సెప్టెంబరులో విదేశీగడ్డపై నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మిగిలిపోయిన మ్యాచ్‌ల్లో తమ దేశ ఆటగాళ్లు ఆడకపోవచ్చని ఇంగ్లాండ్ బోర్డు ఇటీవల తెలిపింది. అంతర్జాతీయ క్యాలెండర్ దృష్ట్యా బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లు మోర్గాన్, స్టోక్స్, బట్లర్.. లీగ్‌లో పాల్గొనరని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: సింగపూర్ ఓపెన్ రద్దు.. సైనా, శ్రీకాంత్ ఆశలు గల్లంతు!