టీవీలో సచిన్ తెందూల్కర్ ఆటను చూసి తాను పలు క్రికెట్ షాట్లు నేర్చుకున్నానని వెల్లడించాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. స్ట్రైట్ డ్రైవ్‌తో పాటు బ్యాక్‌ఫుట్ షాట్లు ఇలా తెలుసుకున్నవేనని చెప్పాడు.
"1992 ప్రపంచకప్ సందర్భంగా నేను టీవీలో క్రికెట్ చూశా. అందులో చూసి సచిన్ ఆడుతున్న స్ట్రైట్ డ్రైవ్‌ను నేర్చుకున్నా. ఈ రోజుల్లో యువ ఆటగాళ్లకు చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల క్రికెట్ షాట్లను తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సౌకర్యాలు మా రోజుల్లో ఉంటే నేను త్వరగానే భారత జట్టుకు ఎంపికయ్యేవాడిని."
-వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
"నా కెరీర్ ప్రారంభంలో చాలా మంది ఫుట్‌వర్క్‌ను మెరుగుపరుచుకోవాలనేవారు. కానీ, ఎలా అనేది మాత్రం చెప్పేవారు కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గావస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్.. ఈ విషయంలో సహాయం చేశారు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: Tweet controversy: వివాదంలో మరో ఇద్దరు క్రికెటర్లు