ETV Bharat / sports

Ashish Nehra: 'గతంలో ఇలా ఆడలేదు.. కొత్త పుజారాను చూస్తున్నాం' - pujara batting

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా ​బ్యాట్స్​మన్ ఛెతేశ్వర్​ పుజారా (Cheteshwar Pujara) వేగంగా బ్యాటింగ్​ చేయడం ఇప్పుడు క్రికెట్​ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఫామ్​లేమితో సతమతమవుతున్న నయావాల్.. బ్యాట్​ ఝుళిపించడం శుభపరిణామం. అయితే పుజారా ఇలా బ్యాటింగ్​ చేయడం గతంలో తానెప్పుడు చూడలేదని ఆశిష్​ నెహ్రా (Ashish Nehra) కూడా ఆశ్చర్యపోయాడు.

Cheteshwar Pujara
ఛెతేశ్వర్ పుజారా
author img

By

Published : Aug 28, 2021, 10:26 AM IST

Updated : Aug 28, 2021, 11:42 AM IST

హెడ్డింగ్లీ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టు మూడో రోజు భారత బ్యాట్స్​మెన్​ ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 78 పరుగులకే ఆలౌటైన కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్​లో పుంజుకున్న తీరు అద్భుతం. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులతో ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లాండ్​ ఆధిక్యానికి ఇంకా 139 పరుగులు వెనకబడి ఉంది. అయితే శుక్రవారం నాటి ఆటలో వేగంగా ఆడిన ఛెతేశ్వర్​ పుజారా (Cheteshwar Pujara) బ్యాటింగే హైలైట్. ఇప్పుడు అభిమానులంతా అతడి ఇన్నింగ్స్​ గురించే చర్చించుకుంటున్నారు.

432 పరుగులకు ఆలౌటైన రూట్​ సేన భారత్​ ముందు 354 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యాన్ని ఉంచింది. దీంతో రెండో ఇన్నింగ్స్​ మొదలుపెట్టిన టీమ్ఇండియా ఆచితూచి ఆడింది. అయినప్పటికీ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్​ నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నయావాల్​ ఛెతేశ్వర్​ పుజారా ధాటిగా ఇన్నింగ్స్​ మొదలుపెట్టాడు. 50 స్ట్రైక్​రేటుతో రన్స్​ సాధించాడు. మొత్తంగా 91* పరుగులు చేస్తే అందులో బౌండరీల ద్వారానే 60 పరుగులు వచ్చాయి. అతడి కెరీర్​లోనే తొలిసారిగా రోటీన్​కు భిన్నంగా అతడి బ్యాటింగ్ చేశాడని చెప్పొచ్చు. గత కొద్దికాలంగా ఫామ్​లేమితో సతమతమవుతున్న పుజారా తిరిగి గాడిలో పడటమే కాక వేగంగా పరుగులు చేయడం అభిమానుల ఆనందానికి కారణంగా మారింది.

"స్లోగా ఆడతూ స్ట్రైక్​ రొటేట్​ చేస్తాడు.. అతడు క్రీజులో ఉంటే మరో ఎండ్​లో ఉన్న బ్యాట్స్​మెన్​ ధైర్యంగా బ్యాటింగ్ చేయొచ్చు" ఇవి పుజారా బ్యాటింగ్​కు దిగితే క్రికెట్ విశ్లేషకులు, ప్రేక్షకుల నుంచి వినిపించే మాట. కెరీర్​లో ఇప్పటివరకు 90 టెస్టు మ్యాచ్​లాడిన పుజారా 6000 పరుగులు పూర్తి చేశాడు. కానీ, తాజాగా లీడ్స్​ మ్యాచ్​లో చాలా వేగంగా రన్స్​ చేసి.. ఫాస్ట్​గా ఆడే సత్తా తనలో ఉందని నిరూపించాడు నయావాల్.

ఇంతవరకూ చూడలేదు..

మూడో టెస్టులో పుజారా బ్యాటింగ్​ తీరుపై టీమ్ఇండియా మాజీ పేసర్​ ఆశిష్​ నెహ్రా (Ashish Nehra) స్పందించాడు. అతడి బ్యాటింగ్​ పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపాడు. సానుకూల మనస్తత్వంతో క్రీజులో గడిపాడని పేర్కొన్నాడు.

"ఛెతేశ్వర్​ పుజారా ఇంతకు ముందెప్పుడూ ఇంత వేగంగా బ్యాటింగ్ చేయలేదు. నేను చూసినంత వరకు అతడు చాలా నిదానంగా స్ట్రైక్​ రొటేట్​ చేస్తుంటాడు. లీడ్స్​ టెస్టులో కొత్త పుజారాను మనం చూస్తున్నాం. అతడి బ్యాటింగ్​కు సంబంధించి ఎలాంటి ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించడం లేదు. అతడి సొంత ఆలోచన ప్రకారమే ఇలాంటి ఇన్నింగ్స్​ ఆడుతున్నాడని నేను చెప్పగలను."

-ఆశిష్​ నెహ్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి: England vs India: టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు డకౌట్ల రికార్డు!

Last Updated : Aug 28, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.