ETV Bharat / sports

కోహ్లీతో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాను: అర్జాన్ - england series Arzan Nagwaswalla

టీమ్​ఇండియాలోకి తనను ఎంపిక చేయడం తనను ఆశ్చర్యపరిచిందని యువ క్రికెటర్ అర్జాన్ చెప్పాడు. ఇంగ్లాండ్​ సిరీస్​లో బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీని ఇప్పటివరకు ఒక్కసారైనా కలవలేదని అన్నాడు. అతడితో కలిసి ఆడేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

kohli
అర్జాన్ నగ్వస్వల్లా కోహ్లీ
author img

By

Published : May 8, 2021, 7:01 PM IST

న్యూజిలాండ్​తో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ కోసం జట్టులో యువ బౌలర్ అర్జాన్ నగ్వస్వల్లా పేరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. ఆసక్తికర విషయం చెప్పాడు. కెప్టెన్ కోహ్లీని ఇప్పటివరకు కలవలేదని చెప్పాడు.

గతంలో ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు ఇతడు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్​లో అయినా చోటు దక్కించుకోలేకపోయాడు. "ముంబయి జట్టులో ఉన్నప్పుడు నేను ఆరాధించే రోహిత్​ శర్మ, జహీర్​ ఖాన్​ను కలిశాను. కానీ ఇప్పటివరకు కోహ్లీని కలవలేదు. అతడితో ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం నన్ను ఎంపికచేయడం ఆశ్యర్యమేసింది. నాలాంటి బౌలర్​కు అక్కడి పిచ్​ పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. అక్కడ ఆడేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అని అర్జాన్ అన్నాడు.

తాను క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు అర్జాన్. "2011 ప్రపంచకప్​ నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది. క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకోవడానికి స్ఫూర్తినిచ్చింది"అని వెల్లడించాడు.

ఇదీ చూడండి: ఎవరీ అర్జాన్ నగ్వస్వల్లా.. ఎంతలా ఆకట్టుకోగలడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.