టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సందర్భంగా.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్(Ind vs Pak Match) మరో మూడు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్(Mattew Hayden on India) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌లో.. కెప్టెన్ తన జట్టుకు నాయకత్వం వహించిన తీరే విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021లో(IPL 2021) ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ పరుగులు చేయడంలో విఫలమైనప్పటికీ జట్టును బాగా నడిపించారని గుర్తుచేశాడు.
"ధోనీ, మోర్గాన్ వ్యక్తిగతంగా ఎక్కువ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. గతంతో పోల్చితే ఈ సీజన్లో వాళ్లు చేసిన పరుగులు చాలా తక్కువ. కానీ, జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లడంలో వారు సఫలం అయ్యారు. యూఏఈలో ఉన్న పరిస్థితుల్లో కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని నా అభిప్రాయం."
-మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.
మరింత ఒత్తిడి..
బ్యాటింగ్‌లో రాణిస్తూ.. జట్టుకు సారథ్యం వహించడం పాకిస్థాన్ జట్టు సారథి బాబర్ అజామ్‌పై(Babar Azam News) ఒత్తిడి పెంచే అంశమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. అందరి దృష్టి బాబర్‌పైనే ఉంటుందని తెలిపాడు.
అయితే.. టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ పాకిస్థాన్ జట్టుకు ప్రమాదకరమైన ఆటగాడని హేడెన్ పేర్కొన్నాడు. టీ20ల్లో రాహుల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడని తెలిపాడు.
ఇదీ చదవండి: