Highest sixers in tests: టెస్టు క్రికెట్ అంటేనే సుదీర్ఘమైన ఆట. ఐదు రోజుల పాటు ఇరు జట్లు పోటాపోటీగా తలపడి చివరికి ప్రత్యర్థిని రెండుసార్లు తమకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలి. ఈ క్రమంలో బ్యాటర్లు పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు తీయాలన్నా గంటల తరబడి మైదానంలో పోరాడాలి. అయితే, ఇలాంటి ఆటను చూడటానికి కొన్నేళ్ల క్రితం అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లాంటి మెగా ఈవెంట్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది. క్రమంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది. అయితే టెస్టుల్లో కూడా కొందరు ఆటగాళ్లు వన్డేలు, టీ20 మ్యాచ్ల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతుంటారు. వేగంగా పరుగులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో టెస్టు మ్యాచుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన వారెవరు? ఎన్ని కొట్టారు? తెలుసుకుందాం..
బెన్ స్టోక్స్:
ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఆల్‌రౌండర్ మొత్తం టెస్టు ఫార్మాట్లో 83 సిక్సులను బాది అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం 77 టెస్టు మ్యాచులు ఆడిన స్టోక్స్ 10 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
టిమ్ సౌథీ:
న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 85 మ్యాచులు ఆడిన సౌథీ 75 సిక్సులు బాదాడు.
ఏంజిలో మాథ్యూస్:
శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మాథ్యూస్ టెస్టు ఫార్మాట్లో 93 మ్యాచులు ఆడి 69 సిక్సులు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 11 సెంచరీలను సాధించాడు.
రోహిత్ శర్మ:
రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూసిన అభిమానులు ఇతడికి ముద్దుగా 'హిట్‌మ్యాన్' అని పేరు పెట్టారు. ఇప్పటివరకు 63 టెస్టు మ్యాచులు ఆడిన ఇతడు 44 సిక్సులు బాదాడు. అలాగే ఈ ఫార్మాట్లో ఎనిమిది సెంచరీలు చేశాడు.
డేవిడ్ వార్నర్:
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు 92 టెస్టు మ్యాచులు ఆడిన వార్నర్ 58 సిక్సులు బాదాడు. ఈ ఫార్మాట్లో 24 సెంచరీలు సాధించాడు.
రిటైర్ అయిన ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితా
ఆటగాడు | మ్యాచులు | సిక్సర్లు | సెంచరీలు |
బ్రెండన్ మెక్కల్లమ్(న్యూజిలాండ్) | 101 | 107 | 12 |
అడమ్ గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా) | 96 | 100 | 17 |
క్రిస్ గేల్(వెస్టిండీస్) | 103 | 98 | 15 |
జాక్వస్ కల్లిస్(దక్షిణాఫ్రికా) | 166 | 97 | 45 |
వీరెేంద్ర సెహ్వాగ్(భారత్) | 104 | 91 | 23 |
బ్రయాన్ లారా(వెస్టిండీస్) | 131 | 88 | 34 |
క్రిస్ కెయిర్న్స్(న్యూజిలాండ్) | 62 | 87 | 05 |
వీవీ రిచర్డ్స్(వెెస్టిండీస్) | 121 | 84 | 24 |
ఇదీ చదవండి: IPL 2022: వీరి ఆట చూసి తీరాల్సిందే!