ఇటీవలే వన్డే సిరీస్ ఆడిన టీమ్ఇండియా-శ్రీలంక తమ గెలుపోటముల ఆధారంగా ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో (ICC Super League) తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. మూడో వన్డే విజయంతో శ్రీలంక 12 నుంచి 11వ ర్యాంకుకు చేరుకోగా.. ఈ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న టీమ్ఇండియా నాలుగో ర్యాంకులో నిలిచింది.
ఈ జాబితాలో ఇంగ్లాండ్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మొత్తం 15 మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ 9 విజయాలు నమోదు చేసింది. 80 పాయింట్లతో బంగ్లాదేశ్, 50 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచాయి.
ఏంటీ సూపర్ లీగ్..
2023 వన్డే ప్రపంచకప్ అర్హత కోసం 2020 జులై 30న ఈ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది ఐసీసీ. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగింది. ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు నెదర్లాండ్స్ ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు స్వదేశంలో మూడు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.
ఈ సూపర్ లీగ్ ద్వారా భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ అర్హత జట్లను నిర్ణయించనున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 7 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన టీమ్‌ల అర్హత కోసం ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ఒకే మ్యాచ్‌లో ఐదుగురు అరంగేట్రం.. అందుకే?