ETV Bharat / sports

ENG vs NZ: మెరిసిన వాగ్నర్, హెన్రీ.. సిరీస్​ కివీస్​ సొంతం - 1-0తో సిరీస్ కివీస్ కైవసం

ఇంగ్లాండ్​తో రెండో టెస్ట్​లో న్యూజిలాండ్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ​ విజయంలో బౌలర్లు వాగ్నర్​, హెన్రీ కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-0తో కైవసం చేసుకుంది పర్యటక జట్టు.

New Zealand defeat England in 2nd Test, clinch series 1-0
ఇంగ్లాండ్​పై కివీస్ విజయం, ఇంగ్లాండ్ vs కివీస్
author img

By

Published : Jun 13, 2021, 5:47 PM IST

బర్మింగ్​హామ్​ వేదికగా​ ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్ట్​లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నీల్ వాగ్నర్​, మాట్​ హెన్రీ తలో మూడు వికెట్లతో రాణించి మ్యాచ్​ విజయంలో కీలకంగా వ్యవహరించారు. రెండు టెస్ట్​ల సిరీస్​లో తొలి మ్యాచ్​ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్​లో కివీస్ విజయ కేతనం ఎగురవేసింది. దీంతో 1-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది పర్యటక జట్టు.

తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌట్​ కాగా న్యూజిలాండ్ 388 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఆతిథ్య జట్టు 122కే కుప్పకూలింది. దీంతో 41 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాథమ్​ సేన... 10.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో.. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది కివీస్.

ఇదీ చదవండి: Rohith Sharma: 'రోహిత్ అలా టెస్ట్​ల్లో ఓపెనర్​గా మారాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.