అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు ముదిరిపోతుంది. జింఖానా మైదానంలో అపెక్స్ కౌన్సిల్ గ్రూప్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుదామనుకుంటే.. పోలీసులు తమను అడ్డుకున్నారని వాపోయారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై(HCA president Azharuddin) అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అజహరుద్దీన్ డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మను తాము వ్యతిరేకించినందుకు తమపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 3-డే లీగ్ నిర్వహించబోతున్నామని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. దానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుచేయబోతుంటే.. అజహర్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా లేరని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. క్రికెట్ అభివృద్ధికి పాటుపాడాల్సిన ఆయన ఇప్పటి వరకు క్రికెట్‌కు చేసిందేమిలేదని అన్నారు. ఉపాధ్యక్షుడు అయిన జాన్ మనోజ్‌ను.. తాత్కాలిక అధ్యక్షుడిగా నిర్ణయించినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. జూలై 18న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఏజీఎమ్‌లో అంబుడ్స్‌మన్‌గా కక్రూకే మెజారిటీ లభించిందని వారు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: