Hardik Pandya T20 Worldcup: టీ20 ప్రపంచ్‌కప్‌లో అద్భుతంగా రాణించడమే తన లక్ష్యమని చెప్పాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. దాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ప్రాక్టీసు చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవలే అతడు.. ఐపీఎల్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే 'ఐపీఎల్ 2022 కోసం ఎలా సన్నద్ధమవుతున్నారు' అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చాడు. ఈ వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.
"ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడమే నా లక్ష్యం. ఈ మెగాటోర్నీని దష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్ధంగా సన్నద్ధమవుతున్నాను. బాగా శిక్షణ చేస్తున్నా. దేశానికి విజయాన్ని అందించాలి. అది నన్ను గర్వంగా భావించేలా చేస్తుంది. సంతోషాన్నిస్తుంది. ఈ ఐపీఎల్.. మెగాటోర్నీకి ముందు మంచి శిక్షణగా ఉపయోగపడుతుంది. వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా విజయం సాధించడానికే నేను కష్టపడుతున్నా"
-హార్దిక్ పాండ్య, టీమ్ఇండియా ఆల్‌రౌండర్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన కెరీర్‌పై మహీ ఎంతో ప్రభావం చూపాడని ఇటీవలే హార్దిక్ అన్నాడు. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు.
2019 వెన్నుముక శస్త్రచికిత్స తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు హార్దిక్. ఐపీఎల్ 2021, టీ ప్రపంచకప్ 2021లో పేలవ ప్రదర్శన చేసి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకునేందుకు తాను తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!