ETV Bharat / sports

sehwag on hardik: 'టీ20 ప్రపంచకప్​లో పాండ్యా అలా ఆడాలి'

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా(hardik pandya news) వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నపటి నుంచి బౌలింగ్​ చేయడం లేదు. ఇప్పటివరకు కొన్నిసార్లు మాత్రమే అటు టీమ్ఇండియా, ఇటు ముంబయి ఇండియన్స్​కు బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇతడిని టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించాడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్(virendra sehwag cricketer).

Hardik Pandya
హార్దిక్
author img

By

Published : Sep 30, 2021, 3:18 PM IST

రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(hardik pandya news).. జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(virendra sehwag cricketer) మాట్లాడాడు. కొన్నాళ్ల క్రితం హార్దిక్‌(hardik pandya news) వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున కూడా చాలా తక్కువ సార్లు బౌలింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించాడు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని చెప్పాడు. పాండ్యా(hardik pandya news) తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడని పేర్కొన్నాడు.

"హార్దిక్ పాండ్యా(hardik pandya news) మొదట బ్యాట్స్‌మన్‌. బౌలింగ్‌ చేయడం అనేది కేవలం బోనస్. అతను ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు. బ్యాట్‌తో మ్యాచ్‌లను గెలిపించగలడు. టీ20 ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగాలి. అలాంటి ఆటగాడు ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు" అని సెహ్వాగ్‌(virendra sehwag cricketer) అన్నాడు.

భారత మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా(ajay jadeja career) కూడా పాండ్యా(hardik pandya news) గురించి మాట్లాడాడు. "హార్దిక్‌ను ముందుగా బ్యాట్స్‌మన్‌గా చూడాలి. బ్యాట్స్‌మెన్‌ ఎదగాలంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపించాలి. ప్రస్తుతం అతను ముందుగా వచ్చి నిరూపించుకున్నాడు. మధ్య ఓవర్లలో చాలా బాగా ఆడగల నైపుణ్యం ఉంది. ముంబయి ఇండియన్స్‌ అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది" అని జడేజా అన్నాడు.

ఇవీ చూడండి: ఈ బౌలర్​ ప్రదర్శనతో ఆర్సీబీ దశ తిరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.