ETV Bharat / sports

టీమ్​ కోసమే ధోనీలా చేయాల్సి వస్తుంది: హార్దిక్​

మహేంద్ర సింగ్​ ధోనీ రిటైరయ్యాక ఆ బాధ్యత నేను తీసుకున్నానంటూ టీమ్​ ఇండియా స్టాండ్​ ఇన్​ కెప్టెన్ హార్దిక్ పాండ్య పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్​తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన తర్వాత.. గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ పలు కీలక అంశాల గురించి మాట్లాడాడు. ఆ వివరాలు..

dhoni
hardik pandya
author img

By

Published : Feb 2, 2023, 12:57 PM IST

టీమ్​ కోసం ధోనీ చేసినట్లే తాను కూడా చేయగలనంటూ టీమ్​ఇండియా కెప్టెన్​ హార్దిక్​ పాండ్య అన్నాడు. బుధవారం జరిగిన న్యూజిలాండ్ వర్సెస్​ భారత్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం తర్వాత హార్దిక్ ధోనీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యాలు చేశాడు. "మహీ బాధ్యతను తీసుకోవడానికి నేను వెనుకాడను. మాహీ ఈ పాత్రను పోషించేవాడు. ఆ సమయంలో నేను యువకుడిగా ఉన్నాను. గ్రౌండ్ నలుమూలలా సిక్స్​లు బాదేవాడిని. కానీ ఆయన వెళ్లిన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. కానీ దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఫలితాలు వస్తున్నాయి. నెమ్మదిగా ఆడటం వల్ల నష్టమేమీ లేదు" అని హార్దిక్ అన్నాడు.

"నేను సిక్స్​లు కొట్టడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. కానీ జీవితమంటే అదే. ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. నేను భాగస్వామ్యాలను నమ్ముతున్నాను. నేను క్రీజులో ఉన్నానన్న నమ్మకాన్ని నా బ్యాటింగ్ పార్ట్‌నర్‌కు, నా టీమ్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీమ్​లో ఉన్న అందరి కంటే నేనే ఎక్కువ మ్యాచ్​లు ఆడాను. ఒత్తిడిని ఎలా అధిగమించాలి.. బయటకు ప్రశాంతంగా ఎలా కనిపించాలో నాకు తెలుసు. దాని కోసమే నా స్ట్రైక్ రేట్ ను తగ్గించుకున్నా. కొత్త రోల్స్​ను తీసుకోవడానికే నేను ఎప్పుడూ ఇష్టపడుతుంటాను. అందుకే నేను కొత్త బంతితోనూ బౌలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఆ క్లిష్టమైన రోల్ తీసుకోవాలని నేను అనుకోను. నేను ముందుండి నడిపించాలని అనుకుంటాను. కొత్త బంతితో బౌలింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని పాండ్యా అభిప్రాయపడ్డాడు.

'బుమ్రా కోసం కొత్త బాల్​ పట్టా'
గాయాలతో మ్యాచ్​కు దూరమైన జస్ప్రీత్​ బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు హార్దిక్​ కొత్త బాల్​ను పట్టుకున్నాడు. అలా పవర్‌ప్లేలో 12 ఓవర్లకు బౌలింగ్​ చేసిన పాండ్య.. హోమ్ సీజన్‌లో రెండు వికెట్లకు 86 పరుగులు ఇచ్చాడు. "నేను టీ20లో కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అర్షదీప్​ లాంటి న్యూ ప్లేయర్స్​ కొత్త బంతితో మొదట బౌలింగ్ చేసే కష్టమైన పాత్రను పోషించడం నాకు ఇష్టం లేదు. ఒక వేళ వారిపై ఒత్తిడిని తీసుకొస్తే అది ఆటను అన్ని విధాలుగా నష్టపరుస్తుంది. అందుకే నేను ఎల్లప్పుడూ ముందు ఉండి నాయకత్వం వహిస్తున్నాను అలా నేను నా కొత్త-బంతి నైపుణ్యాలను నేర్చుకుంటున్నాను." కాగా 87 టీ20ల్లో హార్దిక్​ 26.43 సగటుతో 69 వికెట్లు తీశాడు.

2018 ఆగస్టులో చివరిసారిగా టెస్ట్​ మ్యాచ్​ ఆడిన హార్దిక్, ఈ ఏడాది భారతదేశంలో జరగనున్న ప్రపంచ కప్​తో పాటు వచ్చే ఏడాది కరీబియన్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్​కే తన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపాడు."టెస్ట్-మ్యాచ్ క్రికెట్ ఆడటానికి ఇది సరైన సమయం అని నేను భావించినప్పుడు తిరిగి వస్తాను" అని హార్దిక్ చెప్పాడు.

'అతని ఆటను చూసి నేనేం ఆశ్చర్యపోలేదు'
అన్ని ఫార్మాట్లల్లో దూసుకెళ్తున్న శుభ్​మన్​ గిల్ ప్రతిభను హార్దిక్​ మెచ్చుకున్నాడు​. "నాకు మొదటి నుంచే తెలుసు అతనికి అన్ని ఫార్మాట్లు ఆడే శక్తి సామర్థ్యాలున్నాయని. ఈ విషయంపై నేను ఆశ్చర్యపోలేదు. ఒత్తిడి పెట్టకుండా అతనిలా అలావోకగా ఆడగల సామర్థ్యం గల ప్లేయర్స్​ను చూడటం అరుదు. యువకుడిగా అన్ని ఫార్మాట్లలో ఆడటం అనేది అతనకి ఎంతో ముఖ్యం. అంతే కాకుండా ఇది మ్యాచ్​కు ఓ కొత్త కోణాన్ని జత చేస్తుంది" అని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.