ETV Bharat / sports

Sourav Ganguly: టీమ్ఇండియాను మరోస్థాయికి తీసుకెళ్లిన సారథి - క్రికెట్​

సౌరవ్​ గంగూలీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో విజయాలు సాధించింది. భారత జట్టును ముందుండి నడిపించి.. క్రికెట్​ ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దాదా ఎంతో కృషి చేశాడు. గురువారం (జులై 8) ఆయన పుట్టినరోజు సందర్భంగా గంగూలీ సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం..

ganguly birth day
గంగూలీ బర్త్​డే
author img

By

Published : Jul 8, 2021, 7:37 AM IST

ఆటతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, టీమ్​ఇండియాకు సారథిగానూ.. దేశ ఖ్యాతిని మరో స్థాయికి తీసకెళ్లేందుకు కృషి చేసిన క్రికెటర్​ సౌరవ్​ గంగూలీ. సన్నిహితులతో పాటు, అభిమానులు ఆయనను ముద్దుగా 'దాదా' అని పిలుచుకుంటారు. క్రికెట్​ ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఈయన 49వ పుట్టిన రోజు నేడు.​ ​ఏ మ్యాచ్​లోనైనా జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ ఎప్పుడూ వెనకడుగు వేసేవాడు కాదని తోటి ఆటగాళ్లు చెబుతుంటారు. దాదాను 'గాడ్​ ఆఫ్​ హాఫ్​ సైడ్​' అని పిలుస్తుంటాడు రాహుల్​ ద్రవిడ్.

దశాబ్దకాలం పాటు బ్యాటింగ్​లో గంగూలీ.. తన మెరుపు వేగంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. దాదా వస్తున్నాడంటే చాలు ప్రత్యర్థి జట్టు తలనొప్పిగా భావించేలా బ్యాటింగ్​లో విజృంభించాడు. ఈ క్రమంలోనే ఆయన క్రికెట్​ ప్రస్థానంతో పాటు, టీమ్​ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి చేసిన కృషిపై ఓ లుక్కేద్దాం.

happy birthday ganguly
సౌరవ్​ గంగూలీ

ఆరంభంలోనే వరుస సెంచరీలు

గంగూలీ.. 1996 వేసవిలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అరంగేట్రం చేశాడు. లార్డ్స్​ వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్​లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో టెస్టులోనూ శతకం కొట్టి, అలా మొదటి రెండు ఇన్నింగ్స్​లోనే వరుస శతకాలు చేసిన మూడో బ్యాట్స్​మన్​గా గుర్తింపు పొందాడు. 1997లో వరుసగా నాలుగు 'మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​' అవార్డులను సొంతం చేసుకున్న ఘనత గంగూలీదే. ఆ తర్వాత 1999 వన్డే​ ప్రపంచకప్​లో శ్రీలంక- భారత్​ మధ్య జరిగిన మ్యాచ్​లో కెరీర్​లో అత్యధిక పరుగులు (183) పరుగులు చేశాడు.

ఉద్రిక్తతల నడుమ కెప్టెన్​గా..

క్రికెట్​లో భారత్​ దూసుకెళ్తున్న క్రమంలో, 2000 సంవత్సరంలో మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలు జట్టును చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ సమయంలో కెప్టెన్​గా పగ్గాలు అందుకున్నాడు. ఇలాంటి సమయంలో సారథ్యం వహించడం ఎంతో కష్టమే కానీ, దాదాకు అవేవీ అడ్డంకి కాలేదు. సారథిగా మారిన తర్వాతే దాదాలోని అసలైన ప్రతిభ బయటపడింది.

happy birthday ganguly
సౌరవ్​ గంగూలీ

యువరాజ్​ సింగ్​, హర్బజన్​ సింగ్​, మహమ్మద్​ కైఫ్​,​ ధోనీ, ఆశిష్​ నెహ్రా, జహీర్​ ఖాన్​ లాంటి యువ ప్రతిభావంతులు.. దాదా సారథ్యంలోనే జట్టులోకి వచ్చారు. ఇదే ఆయన ఉత్తమ నాయకత్వ లక్షణానికి నిదర్శనం.

చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్​

ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్​ ట్రోఫీలో గంగూలీ.. టీమ్ఇండియాను ఫైనల్​ వరకు నడిపించారు. ఆ తర్వాత 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో 2-1 తేడాతో భారత్​ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్​ ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా గొప్ప విజయాన్ని నమోదు చేసింది.

టీమ్​ఇండియా క్రికెట్​ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే 2002 నాట్​వెస్ట్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​ సంగతి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ను భారత్​ ఓడించినప్పుడు.. గంగూలీ ఆనందంతో తన జెర్సీ విప్పి గిరగిర తిప్పాడు. ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయిన ఘటన ఇది.

happy birthday ganguly
సౌరవ్​ గంగూలీ

దాయది గడ్డపై తొలి విజయం

2003లో ప్రపంచకప్​ ఫైనల్​లో టీమ్​ఇండియాకు దిశానిర్దేశం చేశారు గంగూలీ. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్​లో భారత్​ ఓటమిపాలైంది. 2004లో పాకిస్థాన్​లో జరిగిన వన్డే, టెస్టు సిరీస్​లకు భారత జట్టుకు సారథ్య వహించారు దాదా. ఈ టెస్టు సిరీస్​లో పాక్​ గడ్డపై భారత్​ ఘనవిజయం సాధించింది. దాయాది దేశంలో టీమ్​ఇండియా సాధించిన తొలి గెలుపు ఇదే.

అలా కెప్టెన్సీకి దూరం..

2005వ సంవత్సంలో టీమ్​ఇండియా జట్టు కోచ్​గా గ్రెగ్​ ఛాపెల్​ను నియమితుడయ్యాడు. ఈ క్రమంలో జట్టులో తలెత్తిన విభేదాల కారణంగా కెప్టెన్​ పదవి నుంచి దాదా తప్పుకున్నాడు. ​అయితే, గంగూలీ దురుసుగా ప్రవర్తించాడని, జట్టులో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాడని ఛాపెల్​ విమర్శించారు.

ఆఖరి టెస్టు సిరీస్​

ఆస్ట్రేలియాతో 2008 నాగ్​పుర్​లో చివరి టెస్టు సిరీస్​ ఆడాడు గంగూలీ. ఆ తర్వాత ఐపీఎల్​లో కొనసాగాడు. కానీ, 2012లో దేశీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

happy birthday ganguly
సౌరవ్​ గంగూలీ

దాదా ఉత్తమ ప్రదర్శన..

ఇప్పటి వరకు భారత్​ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు గంగూలీ. తన అంతర్జాతీయ క్రికెట్​ కెరీర్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు సాధించాడు. 195 మ్యాచ్​ల్లో టీమ్​ఇండియాకు సారథిగా వ్యవహరించగా.. ఇందులో 97 మ్యాచ్​లను గెలిపించాడు. భారత్​లో డే/నైట్​ టెస్ట్​ క్రికెట్​ ఆలోచనను ముందుకు తీసుకురావడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు.

గతంలో క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బెంగాల్​(క్యాబ్​) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి:యూఏఈలోనే టీ20 ప్రపంచకప్.. గంగూలీ వెల్లడి​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.