ETV Bharat / sports

Gujarat Titans: జేసన్​ రాయ్​ స్థానంలో ఆ ఓపెనర్​! - గుజరాత్​ టైటాన్స్​ అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌

Gujarat Titans Jason roy Replacement: లీగ్​ ప్రారంభానికి ముందే వైదొలిగిన జేసన్​రాయ్​ స్థానంలో అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌తో భర్తీ చేయాలని గుజరాత్​ టైటాన్స్​ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

gujarat titans
గుజరాత్​ టైటాన్స్​
author img

By

Published : Mar 9, 2022, 7:30 AM IST

Gujarat Titans Jason roy Replacement: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ జట్టులోకి అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ను తీసుకునే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాల రీత్యా మెగాలీగ్​ ప్రారంభం కాక ముందే ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ గుజరాత్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడి స్థానంలో రహ్మనుల్లాను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రహ్మానుల్లాను జట్టులోకి తీసుకుంటే వికెట్ కీపింగ్‌ విషయంలో కూడా గుజరాత్‌కు కలిసొస్తుంది. ప్రస్తుతం మాథ్యూ వేడ్‌, వృద్ధిమాన్‌ సాహా వంటి వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. అయితే, పాకిస్థాన్‌ పర్యటనకు ఎంపికైన మాథ్యూ వేడ్‌.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడు. మరోవైపు, సాహాకు వికెట్‌ కీపర్‌గా ఐపీఎల్‌లో మెరుగైన రికార్డేమీ లేదు. ఈ నేపథ్యంలో రహ్మనుల్లాను జట్టులోకి తీసుకోవడం లాంఛనమే కావచ్చు!

అంతర్జాతీయ క్రికెట్లో 20 టీ20 మ్యాచులు ఆడిన రహ్మానుల్లా 137.63 సగటుతో 534 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే, 9 వన్డేల్లో 91.85 స్ట్రైక్‌ రేట్‌తో మూడు శతకాలు సహా 428 పరుగులు చేశాడు. గుజరాత్‌ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా, ఆశిష్‌ నెహ్రా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: హీరోయిన్ల జోరు.. వరుస సినిమాలతో హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.