Greatest ODI Innings Of All Time : 2023 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. 292 లక్ష్య సాధనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆసీస్‌ను.. అజేయమైన డబుల్ సెంచరీతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వన్డే మ్యాచ్ ఛేజింగ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ చరిత్రలో.. ఇప్పటివరకు వన్డేల్లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనలేవో తెలుసుకుందాం.
- వివ్ రిచర్డ్స్
వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్.. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 1984 లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రిచర్డ్స్ క్రీజులోకి వచ్చాడు. ఓ దశలో విండీస్ 166 కే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక పదకొండో బ్యాటర్‌గా వచ్చిన మైఖేల్ హోల్డింగ్‌తో కలిసి రిచర్డ్స్.. 106 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. దీంతో విండీస్ ఆ మ్యాచ్‌లో 272 పరుగులు సాధించింది. అందులో రిచర్డ్స్వే 189 పరుగులు. ఆ మ్యాచ్ లో మిగిలిన 10 మంది బ్యాటర్లు 73 పరుగులే కొట్టడం గమనార్హం. - కపిల్ దేవ్
టీమ్ఇండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్.. తన పేరిట మరపు రాని రికార్డు లిఖించుకున్నాడు. 1983 వరల్డ్ కప్ టోర్నీలో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 9 - 4 తో కష్టాల్లో పడింది. అప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన కపిల్.. జాగ్రత్తగా ఆడుతూ స్కోరును బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ మరోవైపు వికెట్లు పడటంతో పరిస్థితి 140 - 8 కి చేరుకుంది. దీంతో కెప్టెన్ కపిల్.. ధాటిగా ఆడటం మొదలు పెట్టాడు. తన ఫస్ట్ హాఫ్ సెంచరీని సుమారు 70 బంతుల్లో పూర్తి చేస్తే.. తర్వాత 50 ని 30 బాల్స్ లోనే కంప్లీట్ చేశాడు. ఇక చివరి 38 బంతుల్లో మరో 75 రన్స్ కొట్టి మొత్తం 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. - సయీద్ అన్వర్
పాకిస్థాన్ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్.. 1997 లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 194 పరుగులు బాదాడు. అప్పటికి వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇండిపెండెన్స్ కప్ టోర్నీలో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. అనిల్ కుంబ్లే వేసిన ఓ ఓవర్లో సయీద్.. హ్యాట్రిక్ సిక్సులు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌ను పాక్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. అయితే ఓ క్రమంలో డబుల్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, 47వ ఓవర్‌లో ఔటై.. పెవిలియన్ చేరుకున్నాడు. ఆ మ్యాచ్ లో పాక్ జట్టు 327 పరుగుల భారీ స్కోరు సాధించింది. - మార్టిన్ గప్తిల్
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు కొట్టాడు. అతడు 2015 వరల్డ్‌కప్ టోర్నీలో.. వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 163 బంతుల్లో 237 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే గప్తిల్ ఇచ్చిన క్యాచ్ ని వెస్టిండీస్ ఆటగాడు శ్యామ్యూల్స్ వదిలేశాడు. దీంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోని గప్టిల్.. విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టించాడు. - రోహిత్ శర్మ
వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 173 బంతుల్లో అసాధారణ రీతిలో 264 పరుగులు బాదాడు. గాయాల బెడద నుంచి అప్పుడే కోలుకోని వచ్చిన రోహిత్.. లంక బౌలర్లకు చుక్కలు చూపింటాడు. రోహిత్ దెబ్బకు భారత్ 404 పరుగులు సాధించింది. - ఫకర్ జమాన్
పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్.. 2021 లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 155 బంతుల్లో 193 రన్స్ చేశాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పట్టు వదలని జమాన్.. 18 ఫోర్లు, 10 సిక్సులతో బీభత్సం సృష్టించాడు. కానీ, చివరి ఓవర్లో జమాన్.. రనౌట్ కావడం వల్ల పాక్ ఓడిపోయింది. - సచిన్ తెందూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. ఆస్ట్రేలియాతో 2009 లో జరిగిన మ్యాచ్‌లో 141 బంతుల్లో 175 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్, భారత్ ముందు 351 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో టీమ్ఇండియా టాపార్డర్ విఫలమైంది. కానీ, సచిన్ ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 81 బంతుల్లో తన 45 వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 135 పరుగుల వద్ద లైఫ్ రావడం వల్ల 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత 175 స్కోరు వద్ద ఔట్ కావడంతో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. - సనత్ జయసూర్య
2000లో కోకా కోలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక.. భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య.. 161 బంతుల్లో 189 పరుగులు చేశాడు. దీంతో లంక వన్డే చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఇదే జయసూర్య వన్డే కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. జయసూర్య సెంచరీ మార్క్ అందుకోవడానికి 118 బంతులు తీసుకోగా.. తర్వాత 89 పరుగుల్ని 43 బంతుల్లోనే చేయడం విశేషం. - మార్కస్ స్టోయినిస్
2017లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్..117 బంతుల్లో 146 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేసిన ఆసీస్.. తమ విజయానికి ఆఖర్లో 60 పరుగులు కావాలి. కానీ, అప్పటికే ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో బౌలర్ హేజిల్‌వుడ్‌తో కలిసి స్టోయినిస్ జట్టును విజయం వైపు నడిపించాడు. విజయానికి ఇంకా 5 రన్స్ కావాల్సిన దశలో హేజిల్ వుడ్ రనౌటయ్యాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. - తిసారా పెరీరా
2019లో శ్రీలంక, న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్.. శ్రీలంక ముందు 320 పరుగుల భారీ టార్గెట్ ఉంచిది. ఛేదనలో లంక, 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన పెరీరా.. బౌండరీలతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 57 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కానీ, పరుగులు సాధిస్తూ మంచి ఊపు మీదున్న అతడిని.. హెన్రీ ఔట్ చేయడం వల్ల లంక 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో పెరీరా 74 బంతుల్లో 140 పరుగులు చేశాడు.
-
Rohit Sharma Carnage
— yasir🇮🇳45 (@PoetVanity45) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
201(151) to 264(173) pic.twitter.com/FIdHzjqXov
">Rohit Sharma Carnage
— yasir🇮🇳45 (@PoetVanity45) November 9, 2023
201(151) to 264(173) pic.twitter.com/FIdHzjqXovRohit Sharma Carnage
— yasir🇮🇳45 (@PoetVanity45) November 9, 2023
201(151) to 264(173) pic.twitter.com/FIdHzjqXov
వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లదే హవా - ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా వివ్ రిచర్డ్స్!