కొంతకాలంగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటగాళ్ల ఆటతీరు కూడా మారుతోంది. కొంతమంది క్రికెటర్లు వినూత్నమైన షాట్లు ఆడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫీల్డర్లు పాదరసంలా కదులుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటున్నారు. బౌండరీ లైన్ వద్ద కూడా జంప్, డైవ్‌లు చేస్తూ అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసిపడుతున్నారు.
తాజాగా ఓ మ్యాచ్‌లో ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌ను ఓ ఫీల్డర్ అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫీల్డర్ ఏం చేశాడంటే.. బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకుని బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. అతడు గాల్లోకి ఎగిరే కాలితో బంతిని గ్రౌండ్‌లోకి తన్నాడు. వెంటనే వేరే ఫీల్డర్ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో చూసి క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, మైఖేల్ వాన్, న్యూజిలాండ్ ఆటగాడు జిమ్మీ నీషమ్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'మీరు ఫుట్‌బాల్ ఆడటం కూడా తెలిసిన క్రికెటర్‌ని ఆడిస్తే ఇలా జరుగుతుంది!!' అని సచిన్ ట్వీట్ చేశాడు. నీషమ్.. కచ్చితంగా ఇది అద్భుతమైన క్యాచ్ అని ట్వీట్ చేశాడు.
-
Taking boundary catching to a whole new level...🏃♂️
— Omkar Mankame (@Oam_16) February 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Via WhatsApp. pic.twitter.com/0r2Qcie3gX
">Taking boundary catching to a whole new level...🏃♂️
— Omkar Mankame (@Oam_16) February 12, 2023
Via WhatsApp. pic.twitter.com/0r2Qcie3gXTaking boundary catching to a whole new level...🏃♂️
— Omkar Mankame (@Oam_16) February 12, 2023
Via WhatsApp. pic.twitter.com/0r2Qcie3gX
ఇదీ చూడండి: అదరగొట్టిన టీమ్ఇండియా.. పాక్‌పై ఘన విజయం..