ETV Bharat / sports

యువరాజ్​కు షాక్.. అనుమతి లేకుండా ఆ పని చేసినందుకు నోటీసులు - tourism department issues notice to Yuvraj Singh

మాజీ క్రికెటర్​ యువరాజ్ సింగ్ విల్లాపై గోవా టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్‌లోని తన విల్లాను గెస్టుల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు ఆన్‌లైన్‌లో పెట్టడంపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

goa-tourism-dept-issues-notice-to-yuvraj-singh

author img

By

Published : Nov 23, 2022, 8:57 AM IST

Yuvraj Singh : టీమ్‌ఇండియా స్టార్‌ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకొన్నాడు. గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్‌లోని తన విల్లాను గెస్టుల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు ఆన్‌లైన్‌లో పెట్టడంపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్‌ ట్రేడ్‌ యాక్ట్‌ 1982 ప్రకారం.. గోవాలో హోమ్‌స్టే (పెయింగ్‌గెస్ట్) ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే..
నవంబర్ 18న ఉత్తర గోవాలోని మోర్జిమ్‌ ప్రాంతంలోని 'కాసా సింగ్‌' పేరిట ఉన్న యువరాజ్‌ విల్లా అడ్రెస్‌కు టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేశ్ కాలే పేరిట నోటీసు జారీ అయింది. డిసెంబర్ 8న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అందులో అధికారులు పేర్కొన్నారు.

టూరిజం యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ఉన్నందున జరిమానా (రూ. లక్ష వరకు) ఎందుకు విధించకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తి హోటల్/గెస్ట్‌ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని గోవా టూరిజం శాఖ స్పష్టం చేసింది. అలాగే గతంలో యువరాజ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌ను కూడా నోటీస్‌లో పేర్కొనడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.