Glenn Maxwell World Cup 2023 : ప్రపంచ క్రికెట్ చరిత్రలోని ప్రమాదకర బ్యాటర్ల లిస్ట్‌లో అతడు ఉంటాడు. బౌలర్లపై కనికరం లేకుండా.. బంతిని నిర్దాక్షిణ్యంగా బాదే ప్లేయర్లలో అతని పేరు తప్పకుండా ఉంటుంది. మైదానంలోకి అతడు అడుగుపెడితే ఇక పరుగుల వరద పారడం ఖాయం. క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు, స్టార్ బ్యాటర్లున్నారు. అయితే తనకే సొంతమైన శైలితో.. అతనిలాగా బంతిని ఊచకోత కోస్తూ అభిమానులను అలరించే ఆటగాడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతను మరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తాజాగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను విరుచుకుపడిన తీరు.. ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన విధానం ఎవ్వరూ అంతా ఈజీగా మరచిపోలేరు.
-
Carnage by Glenn Maxwell 🔥
— ICC (@ICC) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The fastest century in Men's Cricket World Cup history 🙌
Highlights: https://t.co/I4VkUrp1qe#CWC23 | #AUSvNED pic.twitter.com/4aZwcjICPg
">Carnage by Glenn Maxwell 🔥
— ICC (@ICC) October 26, 2023
The fastest century in Men's Cricket World Cup history 🙌
Highlights: https://t.co/I4VkUrp1qe#CWC23 | #AUSvNED pic.twitter.com/4aZwcjICPgCarnage by Glenn Maxwell 🔥
— ICC (@ICC) October 26, 2023
The fastest century in Men's Cricket World Cup history 🙌
Highlights: https://t.co/I4VkUrp1qe#CWC23 | #AUSvNED pic.twitter.com/4aZwcjICPg
తన రికార్డును తానే బద్దలు చేసి..
నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్.. ఇదే మ్యాచ్ వేదికగా మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ నమోదు చేసిన రికార్డు (49 బంతుల్లో)ను ఇప్పుడు మ్యాక్సీ తిరగరాశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా వన్డే శతకం చేసిన ఆటగాడిగానూ తన రికార్డు (2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 51 బంతుల్లో)ను తానే మెరుగు పరుచుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్ (31 బంతుల్లో), కోరె అండర్సన్ (36), షాహిద్ అఫ్రిది (37) టాప్ 3లో ఉండగా.. నాలుగో స్థానాన్ని మ్యాక్సీ కైవసం చేసుకున్నాడు.
గాయాన్ని దాటి మరీ..
అసలు ఈ ప్రపంచకప్‌లో మ్యాక్‌వెల్ ఆడటం పట్ల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం అతని గాయాలు. ఓ పార్టీ సమయంలో అనుకోకుండా అతని ఎడమ కాలు విరిగింది. అయితే దాని నుంచి కోలుకుని అతను తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. కానీ ప్రపంచకప్ నెల రోజులు ఉందన్న సమయంలో మరోసారి చీలమండ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ప్రపంచకప్‌లో ఆడేది అనుమానంగానే మారింది. కానీ ఆ గాయం నుంచి కూడా కోలుకుని టోర్నీలో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్‌గా స్పిన్నర్‌గానూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా జంపా ఒక్కడే ఉండటం వల్ల మరోవైపు నుంచి మ్యాక్సీ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. ఎంతోమంది బ్యాటర్లు క్రీజులోకి వస్తారు.. పరుగులు సాధిస్తారు.. సెంచరీలు చేస్తారు.. వెళ్లిపోతారు. కానీ మ్యాక్సీలాగా ఆటతీరుతో అలరించే బ్యాటర్లు చాలా అరుదనే చెప్పాలి. అతనికి బౌలర్‌తో పని లేదు. తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగడం మాత్రమే తెలుసు.
-
Fastest @cricketworldcup ton and a brilliant run out 💫
— ICC (@ICC) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Glenn Maxwell is the @aramco #POTM for a sensational day in #CWC23 👏#AUSvNED pic.twitter.com/ESAsObYvfQ
">Fastest @cricketworldcup ton and a brilliant run out 💫
— ICC (@ICC) October 25, 2023
Glenn Maxwell is the @aramco #POTM for a sensational day in #CWC23 👏#AUSvNED pic.twitter.com/ESAsObYvfQFastest @cricketworldcup ton and a brilliant run out 💫
— ICC (@ICC) October 25, 2023
Glenn Maxwell is the @aramco #POTM for a sensational day in #CWC23 👏#AUSvNED pic.twitter.com/ESAsObYvfQ
మరోవైపు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు మ్యాక్సీ షాట్ల ఎంపిక పట్ల దిగ్గజ ప్లేయర్ గావస్కర్ తప్పుపట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో శతకం తర్వాత గావస్కరే మ్యాక్సీని అభినందనలతో ముంచెత్తాడు. రివర్స్ స్వీప్‌తో అతను కొట్టిన ఓ సిక్సర్ క్రికెట్లోనే అత్యుత్తమ షాట్ అని గావస్కర్ కొనియాడాడు. స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, కట్, ఫ్లిక్, పుల్.. ఇలా క్రికెట్ డిక్షనరీలోని షాట్లతో పాటు రివర్స్ స్వీప్, స్విచ్ షాట్లతో సిక్సర్లు సాధించడంలో మ్యాక్సీని మించినోళ్లు లేరనే చెప్పాలి. కుడి చేతి వాటం బ్యాటరైన అతను.. ఉన్నట్లుండి లెఫ్టార్మ్ బ్యాటర్‌గా మారి వికెట్లకు అడ్డంగా వచ్చి అలవోకగా స్విచ్ షాట్లతో సిక్సర్లు కొట్టే విధానం కూడా అభిమానులను కట్టిపడేస్తోంది..
శతకం.. తన తనయుడికి అంకితం..
Glenn Maxwell Century : ఇక మ్యాక్సీ అందరివాడు. ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకూ అతను దగ్గరయ్యాడు. అంతే కాదు భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా అమ్మాయి విని రామన్‌ను మ్యాక్సీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఇటీవలే ఓ కొడుకు పుట్టాడు. నెల వయసున్న తనయుడు లోగాన్ మేవరిక్ మ్యాక్స్‌వెల్‌కు తన శతకాన్ని అంకితం చేస్తూ ఊయల ఊపినట్లు మ్యాక్సీ సంబరాలు చేసుకున్నాడు.
World Cup Fastest Centuries : ప్రపంచ కప్‌లో సెంచరీల మోత.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరులు వీరే